Pawan Kalyan: ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్తతో జరిగిందా?

0
169

సికింద్రాబాదులోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం. పాతికేళ్లు నిండకుండానే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకొని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించింది. కాల్ సెంటర్లో పనిచేస్తున్న వీరంతా దిగువ మధ్య తరగతి కుటుంబాల వారని తెలిసింది. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరి అయి చివరకు ఆసుపత్రిలో వీరంతా ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను.

అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలి.ఎందుకంటే సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక కాంప్లెక్స్ లో ఇటీవలే ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారు.ఇప్పుడు ఈ ప్రమాదం.. ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా అనేది తేలాల్సి ఉంది.కార్యాలయ సముదాయాలు, షాపింగ్ మాల్స్ ను తనిఖీ చేయడంతో పాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలి.స్వప్న లోక్ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి. అదే విధంగా కడుపు కోతకు గురైన కుటుంబాల వారికి తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here