జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఓవైపు పవన్ స్టార్‌గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూనే.. ప్రజా సమస్యలను వెలికి తీస్తున్నారు.. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.. అయితే, ఈ మధ్య.. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతల కంటే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అది కాస్తా దిగజారి మరీ.. ఫ్యామిలీ వ్యవహారాల వరకు వెళ్లింది.. వైసీపీ-జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్లింది.. పవన్ కల్యాణ్ తాజాగా విశాఖ వెళ్లినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కేసుల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇది ఇలా ఉంటే.. మరోవైపు.. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో.. విద్యార్థులు చేసిన నినాదాలతో కంగుతున్నారు అధికార పార్టీ నేతలు..
అనకాపల్లిలో ఇవాళ బారీ ర్యాలీ నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ ర్యాలీలో జనసేనకు అనుకూలంగా నినాదాలు చేశారు విద్యార్థులు.. చోడవరంలో వైసీపీ విద్యార్థి భేరిలో వైసీపీ నేతలకు ఇలా షాక్ ఇచ్చారు విద్యార్థులు.. వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో విద్యార్థి భేరి నిర్వహించారు.. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో కొందరు విద్యార్థులు… సీఎం పవర్ స్టార్… సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు.. దీంతో, అవాక్కుకావడం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వంతు అయ్యింది.. ఏదేమైనా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్సా..! మజాకా..! మరి..