ఏపీలో జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అభిమానులు హల్ చల్ చేశారు. ఫ్యాన్స్ కోసం జల్సా మూవీని రాష్ట్రంలోని పలు థియేటర్లలో స్పెషల్ షో వేశారు. కొన్నిచోట్ల ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తే, మరికొన్ని చోట్ల థియేటర్లతో నానా రచ్చ చేశారు. విశాఖ లీలా మహల్ థియేటర్‌లో పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. పవన్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ షో, సెకండ్ షో జల్సా సినిమా ప్రదర్శించగా.. కొందరు అభిమానులు హల్‌చల్ చేశారు. స్క్రీన్, కుర్చీలు ధ్వంసం చేశారు. పేపర్ ముక్కలు, గాజు పెంకులతో థియేటర్ మొత్తం అస్తవ్యస్థంగా మారింది.
కర్నూలు నగరంలోని శ్రీరామ థియేటర్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు రచ్చ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ థియేటర్లో జల్సా చిత్రాన్ని ప్రత్యేకంగా రెండు షోలు ప్రదర్శించారు. ఈ క్రమంలో థియేటర్‌లో సౌండ్ సిస్టం సరిగాలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్‌పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న టూటౌన్ పోలీసులు ఆందోళన కారుల ద్విచక్రవాహనాలను స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పట్టణంలో జల్సా సినిమా షో సందర్భంగా.. వైసిపి,జనసేన కార్యకర్తలు మధ్య గొడవ తలెత్తింది.మయూరి థియేటర్ లో కేక్ కటింగ్ దగ్గర వైసీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో వైసిపి కార్యకర్తపై ఇనుప రాడ్ల తో దాడి చేసారు జనసేన కార్యకర్తలు… దీంతో గాయపడిన వైసిపి కార్యకర్తను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.ముఖ్యమంత్రి జగన్ ను తిట్టడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది.