విజయనగరం పయనమయిన పవన్ కళ్యాణ్

0
545

విశాఖ నోవాటెల్ నుంచి విజయనగరం బయలుదేరారు జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ విజయనగరం వెళుతున్నారని తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు విశాఖలోని పవన్ బస చేసిన హోటల్ కి చేరుకుని నినాదాలు చేశారు. ఇవాళ విజయనగరంలో గుంకలాంలో జగనన్న కాలనీలో నిర్మితమవుతున్న గృహనిర్మాణాలను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ నుంచి రోడు మార్గంలో రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకున్నారు పవన్.విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అపూర్వ స్వాగతం లభించింది. నగరంలోని వై. జంక్షన్, కోర్టు జంక్షన్ వద్ద సాదర స్వాగతం పలికిన జనసేన శ్రేణులు హడావిడి చేశారు. పూలమాలతో సత్కరించి హారతులు పట్టిన వీర మహిళలు.కోర్టు జంక్షన్ నుండి గుంకలాం గ్రామానికి బయలుదేరారు పవన్. భారీగా తరలివచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. మరికాసేపట్లో జగనన్న ఇళ్లు పేదలకు కన్నీళ్లు కార్యక్రమంలో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్

నోవాటల్ నుండి విజయనగరం రోడ్డు మార్గాన బయలుదేరారు. భీమిలి జాతీయ రహదారిపై స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. రాజాపులోవ, అయినాడ జంక్షన్ మీదుగా విజయనగరం చేరుకుంటారు పవన్. వై జంక్షన్ నుంచి ర్యాలీగా గుంకలాం చేరుకుంటారు పవన్ కళ్యాణ్‌. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here