పవన్‌తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోపై మంత్రి సెటైర్లు..

0
776

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్-2 షో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇక, తాజాగా ఈ షోలో పాల్గొన్నారు పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఈ సందర్భంగా బాలయ్యతో పాటు పవన్‌ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు.. ఇక, పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? జనసేనాని సమాధానాలు ఏంటి? ఇటు సినిమా, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌పై బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇదే సమయంలో.. ఈ టాక్‌ షోపై సెటైర్లు పేలుతున్నాయి.. బాలయ్య, పవన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.

ఇక, అన్‌స్టాపబుల్ షోకు పవన్‌ కల్యాణ్‌ వెళ్లడంపై స్పందిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. బావ(చంద్రబాబు నాయుడు)తో తిరిగే పవన్ కల్యాణ్‌.. బావమరిది (నందమూరి బాలకృష్ణ)తో తిరిగితే తప్పేముంది? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, అన్‌స్టాపబుల్ షో.. పేమెంట్ ప్రోగ్రాం.. ఇద్దరికీ డబ్బులు ఇస్తారు అని వ్యాఖ్యానించిన పేర్నినాని.. ఎవరి డైలాగులు వాళ్లకు ముందే ఇస్తారు అని చెప్పుకొచ్చారు.. మరోవైపు బావ (చంద్రబాబు) కోసం బావమరిది (బాలకృష్ణ) ప్రయత్నం చేస్తున్నారని కామెంట్‌ చేసిన ఆయన.. బావ కోసం పని చేయటానికి బాలయ్యకు మరో అవకాశం వచ్చిందన్నారు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కొడుకు అయి ఉండి కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు అంటూ బాలయ్యపై మండిపడ్డారు పేర్నినాని. మరోవైపు, సోము వీర్రాజు, జీవీఎల్ కు కాపు రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం చేత ఆమోదింప చేయాలని డిమాండ్‌ చేశారు పేర్నినాని.. ఇక్కడ విజయవాడలో కూర్చుని కబుర్లు చెప్పటం ఎందుకు? అని మండిపడ్డారు.. పవన్ కళ్యాణ్ టీడీపీ నేతల జపం చేస్తున్నాడని జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.. మరోవైపు, కాపులు ముఖ్యమంత్రి అవ్వడం తప్పు కాదు.. అత్యాశ కాదన్న ఆయన.. వైఎస్సార్, జగన్ లా సమాజాన్ని ప్రేరేపితం చేసే వ్యక్తి రావాలని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కాపులను పొట్లం కట్టి టీడీపీ నేతల చేతిలో పెడుతున్నాడని ఆరోపణలు గుప్పించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here