పెట్రోల్‌ ఏ టైంలో కొట్టించాలో తెలుసా..?

0
17

పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించే సమయాన్ని బట్టి మైలేజ్‌ ఇస్తుందా? ఏ సమయంలో చమురు కొట్టిస్తే ఎంత ఉపయోగం.. ఏ టైంలో పెట్రోల్ కొట్టిస్తే నష్టం అనే విషయంపై సోషల్‌ మీడియోలో ఓ రచ్చ నడుస్తోంది. అసలే చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.. పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలు తమ వాహనాలను బయటకు తీసేందుకు జంకుతున్నారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎవరైనా ఎక్కువ మైలేజీ రావాలని కోరుకుంటారు.. మైలేజీ వాహనం పరంగానే కాదు.. ఇంధనం నింపుకునే సమయం కూడా ప్రభావితం చేస్తుంది. అవును.. పెట్రోలు, డీజిల్ నింపుకునే సమయం వచ్చిందని పలువురు వాదిస్తున్నారు. ఉదయాన్నే పెట్రోలు నింపుకుంటే మంచిదని కొందరు అంటుంటే.. మరికొందరు రాత్రిపూట పెట్రోలు నింపుకుంటే మంచిదని అంటున్నారు. మరి ఏ సమయంలో పెట్రోలు నింపడం ప్రయోజనకరం? ఈ వాదనల్లో నిజం ఏమిటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంతకీ ఈ వాదనలో నిజం ఉందా? నిజంగా పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించే సమయం మైలేజీపై ప్రభావం చూపిస్తుందా? అసలు నిజం ఏమిటి? అంటే వ్యక్తుల ప్రకారం.. ఇంధనం సంకోచం మరియు విస్తరణ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వేడి కారణంగా ఇంధనం సన్నగా మారుతుంది. అదే ఉదయం తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కాస్త దట్టంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో పెట్రోల్ నింపడం వల్ల తక్కువ డబ్బుతో సాధారణం కంటే కొంచెం ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుందని వాది వాదనగా ఉంది. ఇక, స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఇంధనం ఉంటుంది.. అయితే, పెట్రోల్ మరియు డీజిల్ స్టేషన్లు వాస్తవానికి ఇంధనాన్ని భూగర్భ ట్యాంకుల్లో నిల్వ చేస్తాయి. కాబట్టి.. అక్కడ పెట్రోల్, డీజిల్ స్థిరమైన ఉష్ణోగ్రతలో ఉంటాయి. మరియు ఈ ట్యాంకులు చాలా మందపాటి టైర్లతో తయారు చేయడి ఉంటాయి.. కాబట్టి అది ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు.

అసలు ఇందులో నిజముందా? ఏది వాస్తవం అనే విషయంలోకి వెళ్తే.. స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఇంధనాన్ని నిల్వ చేయడం ద్వారా, ఉష్ణోగ్రత ఇంధనాన్ని ప్రభావితం చేయదు. పెట్రోల్ మరియు డీజిల్ సాంద్రతలో తేడా లేదు. దీన్నిబట్టి.. పగటిపూట పెట్రోల్ కొన్నారా? రాత్రిపూట పెట్రోల్ కొంటారా? ఎలాంటి తేడా లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే… ఏ సమయంలో తమ వాహనంలో ఇంధనం కొట్టించుకున్నా.. ఆ వాహనాన్ని బట్టి సమాంతర ప్రయోజనం ఉంటుంది తప్పా.. ఒక్కో సమయాన్ని బట్టి ఇక్కో విధంగా ప్రభావితం చేయదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here