బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

0
904

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రయాణించిన హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ శృతిహాసన్‌ తదితరులు హెలికాప్టర్‌లో బయల్దేరారు.. అయితే, 15 నిమిషాల తర్వాత ఒంగోలులోనే అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేశారు పైలట్.. దీంతో, బాలయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అందుకే.. హెలికాప్టర్‌ వెనుదిరిగినట్టు వార్తలు వచ్చాయి.. దీనిపై హెలికాప్టర్‌ పైలట్‌ క్లారిటీ ఇచ్చారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పైలట్‌ ఎస్కే జానా.. పొగమంచు కారణంగా హెలికాప్టర్‌ వెనుదిరగాల్సి వచ్చిందన్నారు.. హైదరాబాద్ కు ప్రయాణించే మార్గం క్లియరెన్స్ లేకపోవటం వల్ల వెనుతిరిగామన్నారు. ప్రస్తుతం ఏటీసీ నుండి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు.. అయితే, హెలికాప్టర్‌లో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదని క్లారిటీ ఇచ్చారు.. కేవలం వెదర్ కండిషన్ బాగాలేకపోవటం వళ్లే వెనక్కు వచ్చామన్నారు. ఏటీసీ నుండి క్లియరెన్స్ రాగానే బయల్దేరనున్నట్టు వెల్లడించారు పైలట్ ఎస్కే జానా..

కాగా, బాలయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒంగోలు పీటీసీ గ్రౌండ్స్ లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.. తన తాజా చిత్రం వీర సింహారెడ్డి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం నిన్న ఒంగోలు వెళ్లిన బాలయ్య.. రాత్రి అక్కడే బస చేశారు.. అయితే, ఇవాళ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.. కానీ, హెలికాప్టర్‌ బయల్దేరిన 15 నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.. కాగా, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డి..కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక, శుక్రవారం ఒంగోలులో జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికగా ట్రైలర్‌ను వదిలి మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది చిత్ర యూనిట్.. బాలయ్య ఊర మాస్ లుక్, పంచ్‌ డైలాగ్స్‌ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. “సీమలో ఏ ఒక్కడు కట్టి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత.. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి.. పుట్టి పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్” అంటూ బాలయ్య బేస్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here