ఏపీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా టీడీపీ నేతలు బీజేపీ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బీజేపీపై హాట్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే బీజేపీ నేతలు భయపడుతున్నారన్నారు. టీడీపీతో జనసేన పార్టీని కలవకుండా బీజేపీ ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తాం అన్నారు పితాని.
బీజేపీ ముందు ఒక రాజకీయం తెర వెనుక మరో రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెనుక జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి దేశానికి బీజేపీ అవసరమా అని ప్రజలు ప్రశ్నించే రోజు రాబోతుందన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. టీడీపీ నేతల కామెంట్లపై బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి.