నిర్మలమ్మ ఆదేశాలు.. 24 గంటల్లోనే మోడీ ఫోటోలు పెట్టి కౌంటర్‌ ఇచ్చారుగా..

0
606

తెలంగాణలో టీఆర్ఎస్‌-బీజేపీ మధ్య ఫోటోల ఫ్లెక్సీల యుద్ధం ఈ నాటిది కాదు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది.. సోషల్‌ మీడియాలోనూ.. పెద్ద రచ్చే జరిగింది.. అయితే.. ఇప్పుడు.. మరోసారి అలాంటి యుద్ధానికి తెరలేపారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్… శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె.. బీర్కూరు మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు.. అయితే, రేషన్ షాపుల్లో పూర్తిగా ఉచితంగా రేషన్‌ అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీని ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్‌.. ఈ విషయంలో రేషన్ డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి… వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.. అయితే, ఆ రేషన్‌ షాపు దగ్గర మోడీ ఫొటో కనిపించలేదు.. కానీ, మరో చోట మాత్రం ప్రధాని ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి..

వినియోగదారులకు వంట గ్యాస్‌ పంపిణీ చేసేందుకు ఎల్‌పీజీ సిలిండర్ల లోడ్‌తో ఓ ఆటో వెళ్తుంది.. ఆ ఆటో నిండా గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి.. ఇక, ఆ సిలిండర్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో అటించి ఉన్నాయి.. ‘మోడీ జీ రూ.1105’ అని రాసిఉన్న ఆ ఫొటోలు ప్రధాని మోడీ గట్టిగా నవ్వుతూ కనిపిస్తున్నారు.. అయితే, దీనిపై వెరైటీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అడిగారు.. 24 గంటలు తిరగక ముందే.. ఇలా ప్రధాని ఫొటోలు పెట్టారంటూ సెటైర్లు వేస్తున్నారు.. మొత్తంగా.. మరోసారి టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ, ఫొటోల వార్‌ తెరపైకి వచ్చింది. కాగా, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయయని.. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 నుంచి రూ.1100 దాటించిన ఘనత మోడీదేనంటూ.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here