ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో చింతలపూడి ఎమ్మెల్యే వి. ఆర్.ఎలీజా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పథకాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటనలో ప్రజలు తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని ఎమ్మెల్యే వి. ఆర్. ఎలీజా అన్నారు.
పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. అలాగే రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పధకాలను కొత్త పధకాలను ఎలా అమలు చేయాలని ఆలోచిస్తున్నామని ఎలీజా అన్నారు. రాబోయే కాలంలో జగన్ మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి గా వుండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఇందుకు తామంతా సంతోష పడుతున్నామని, గర్వపడుతున్నామని ఎలీజా అన్నారు.