అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి… 2017లో 30 కోట్ల రూపాయాలు ఇస్తే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు.. టీడీపీలో చేరడానికి అప్పట్లో టీడీ జనార్దన్ రెడ్డితో చర్చలు జరిపిన మాట నిజమా? కాదా? అనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. అసలు నేను చర్చలు జరపలేదని ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు.. ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేది లేదు.. ఎగురనిచ్చేది లేదని.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అధికార దాహం, డబ్బు, దౌర్జన్యాలతో ఎన్నికలు జరుపుకోవాలంటే కుదరదని హెచ్చరించారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, ప్రొద్దుటూరులో తెలుగు దేశం పార్టీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి.