బెంజ్‌ కారులో వచ్చాడు రేషన్‌ తీసుకెళ్లాడు.. ట్విస్ట్‌ ఏంటంటే..?

0
466

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది ప్రభుత్వం.. ఆ కార్డులపై నెలవారి.. రేషన్‌ సరుకులు తీసుకుంటారు లబ్ధిదారులు.. రేషన్ దుకాణాల ద్వారా కోట్లాది కుటుంబాలు చౌకగా బియ్యం, గోధుమలను పొందగలుగుతున్నాయి.. కొన్నిసార్లు వాటిని ఉచితంగా కూడా పంపిణీ చేస్తోంది సర్కార్.. కానీ చాలా ప్రాంతాల్లో రేషన్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది అనేది మాత్రం ఓపెస్‌ సీక్రెట్.. చాలా మంది ధనికులు కూడా బీపీఎల్ కార్డులు పొంది రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు. ఈ విషయం తెలిసినా స్థానిక నేతలు, అధికారులు చూసి చూడన్నట్టు వ్యవహరిస్తూనే ఉన్నారు.. సాధారణంగా రేషన్‌ షాపు దగ్గర గమనిస్తుంటే.. సైకిళ్లు, బైక్‌లు.. ఆటోల్లో తమ నెలవారి రేషన్‌ బియ్యం లాంటివి తీసుకెళ్లడం చూస్తూనే ఉంటాం.. కానీ, ఓ వ్యక్తి ఏకంగా మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో రేషన్‌ షాపుకు వచ్చి.. రేషన్‌ తీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

బెంజ్‌ కారులో రేషన్‌ షాపునకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ ప్రభుత్వం ఆటా దాల్ స్కీమ్‌లో భాగంగా ఉచితంగా గోధుమలను పంపిణీ చేస్తోంది.. సోషల్ మీడియాలో వెలువడిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని ప్రభుత్వ రేషన్ దుకాణానికి మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో సబ్సిడీ ఆహార పదార్థాలను తీసుకోవడానికి వచ్చినట్లు చూపిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కేటగిరీ వ్యక్తుల కోసం ఈ దుకాణాల్లో రేషన్ అందుబాటులో ఉంది, వారు దానిని కిరాణా దుకాణం నుండి కొనుగోలు చేయలేరు కాబట్టి ప్రభుత్వం చౌకగా అందిస్తోంది.. ఈ వస్తువులు కిలోకు రూ. 2 చొప్పున లభిస్తాయి, తద్వారా అత్యంత పేద ప్రజలకు మంచి ఆహారం లభిస్తుంది. కానీ, ఓ కోటీశ్వరుడు ఇలా కారులో వచ్చి పప్పులు మరియు బియ్యం బస్తాలను తీసుకొని వెళ్లడం చర్చగా మారింది.. డ్రైవరు కారు దిగి అక్కడి నుంచి సబ్సిడీ ఆహార బస్తాలను తీసుకుని లగ్జరీ కారు డిక్కీలో పెట్టి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయాడు. ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కగా.. పర్మీత్ సింగ్ బిడోవాలి అనే వ్యక్తి.. సంబంధిత వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.. అసలే ఓవైపు.. ఉచిత పథకాల విషయమై దేశంలో చర్చ నడుస్తోన్న వేళ.. ఈ వీడియో బయటకు రావడం ఆసక్తికరంగా మారింది..

నిక రేషన్ డిపోను అమిత్ కుమార్ అనే వ్యక్తి నడుపుతుండగా.. ఆ వ్యక్తికి బీపీఎల్ కార్డు ఉందని ఆయన విలేకరులతో అన్నారు. ఫోర్జరీని నిరోధించడానికి తన దుకాణానికి వచ్చే వ్యక్తుల ఆధారాలను తనిఖీ చేస్తారా అని అడిగినప్పుడు… తాను కేవలం ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరిస్తున్నానని.. మిగతా విషయాలకు తనకు తెలియదని బదులిచ్చాడు.. ఇక, వీడియోపై వివాదం తర్వాత, మెర్సిడెస్ కారు‌ను నడిపిన వ్యక్తి, ఇది తన బంధువుల కారు అని చెప్పాడు. వారు భారతదేశంలో ఉండడం లేదు.. ఆ కారును మా స్థలంలో పార్క్ చేస్తారు. ఇది డీజిల్ కారు, కాబట్టి మేం దానిని అప్పుడప్పుడు మేమే బయటకు తీస్తుంటామని చెప్పుకొచ్చాడు.. నాకు చిన్న వీడియోగ్రఫీ వ్యాపారం ఉంది, నా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారిని ప్రైవేట్ పాఠశాలకు పంపడానికి నా వద్ద తగినంత డబ్బు కూడా లేదని తెలిపారు సైనీ.. కానీ, ట్విటర్ వినియోగదారులు వీడియోను చూసి షాక్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here