తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచిపేరు

0
771

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిధిగా హాజరై సైకిల్ ర్యాలీలో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణములోని అంబేద్కర్ చౌరస్తా నుండి నేతన్న చౌక్, కొత్త చెరువు గుండా మానేరు తీరాన గల బతుకమ్మ ఘాట్ వరకు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ…… ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ మన్ననలు పొందాలని ఆయన పోలీసులకు సూచించారు.

తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరు ఉన్నదని, దానిని మరింత ఇనుమడింపజేసే విధంగా పని చేయాలన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన పేర్కొన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చునని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట సేపు సైక్లింగ్ చేయాలని ఆయన వివరించారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాలాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ, ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, రక్తధన శిబిరం కార్యక్రమలు నిర్వహించామని వీరికి 31వ తేదీన బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, ఆర్.ఐ లు కుమారస్వామి, యాదగిరి, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here