ఎంజీఎంలో మళ్లీ ఎలుకల గోల

0
597

ఎంజీఎంలో మళ్ళీ ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. అయినా అధికారుల్లో చలనం కనిపించడంలేదు. ఒకరి ప్రాణం బలిగొన్నా.. అధికారులు స్పందించడం లేదు. పిల్లల వార్డులో ఎలుకల సంచారం తల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో మళ్ళీ ఎలుకలు సంచరిస్తున్నాయి. మంగళవారం ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బీజేపీ నాయకులు పరామర్శించారు.

ఈ క్రమంలో ఎంజీఎంలో ఎలుకలు సంచరిస్తున్న విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్ రెడ్డి గమనించారు. గతంలో ఎలుక కొరికిన ఘటనపై – కొత్త రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కంటి తుడుపు చర్యలు చేపట్టినా.. శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. హాస్టల్లో బల్లులు పడి ఫుడ్ పాయిజన్ అయితే ఇప్పడు అప్ప త్రిలో చేరితే ఎలుకల చేతిలో అపాయం పొంచి ఉందన్నారు. బంగారు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు. విద్యార్థులకు ఏమైన హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here