రియల్టర్‌ దారుణ హత్య.. మృతదేహాన్ని 12 ముక్కలు చేసి అక్కడక్కడపడవేసిన ప్రియురాలు..

0
1002

రోజుకో కొత్త తరహాలో హత్య కేసులు వెలుగు చూస్తున్నాయి.. కొన్ని ఘటనలు ఊహిస్తేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.. అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో కలకలం రేపుతోంది… రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన తన భర్త ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, రియల్టర్‌ ప్రభుకి సంబంధించిన వారిని విచారించగా కవిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి..

కవితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన ప్రభును.. పెళ్లిచేసుకోవాలని కవిత పట్టుబట్టింది.. దీంతో, బెదిరింపులకు దిగాడు ప్రభు.. తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు.. ఇక, ఎలాగైనా ప్రభును మట్టుబెట్టాలని ప్లాన్‌ వేసిన కవిత.. తెలిసినవారి సహాయం తీసుకుంది.. ప్రభును దారుణంగా హత్య చేసింది.. దుంగలను కట్‌ చేసే కట్టర్‌ మిషన్‌తో ప్రభు శరీర భాగాలని ఏకంగా 12 ముక్కలు చేసింది.. ముక్కలైన శరీర భాగాలను టౌన్ లో అక్కడక్కడా పడవేసింది.. పోలీసుల విచారణలో తీగ లాగితే డొంక కదిలినట్టు.. మొత్తం గుట్టు బయటపడింది… ఈ కేసులో కవితితో సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు… రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ప్రభు మిస్సింగ్‌, హత్య కేసును ఛేధించారు. కోయింబత్తుర్‌లో పలు చోట్ల దొరికిన శరీర భాగాలను అదృశ్యమైన ప్రభువిగా గుర్తించారు.. పెళ్లి విషయంలోనే ప్రభుని మిషన్ కట్టర్ తో నరికి చంపి, శరీర భాగాలని అక్కడక్కడా పడవేసినట్టు పోలీసుల విచారణలు ఆ యువతి ఒప్పుకున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం ఈ కేసు తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here