- తెలుగు చిత్రసీమలో కృష్ణంరాజు సెల్ఫ్ మేకింగ్ పర్శన్. సినిమా నేపథ్యం లేకుండా చిత్రసీమలోకి వ్యక్తిగా అడుగుపెట్టి పెద్ద వ్యవస్థను స్థాపించారు.
- ఐదు దశాబ్దాల నట జీవితంతో పాటు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్రమంత్రిగా దేశానికి సేవ చేశారు
- 1940 జనవరి 20న మొగల్తూరులో జన్మించారు
- తండ్రి ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, తల్లి లక్ష్మీదేవి
- కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు
- నర్సాపూర్ టైలర్ హైస్కూల్, వై.ఎన్.ఆర్. కాలేజీలో విద్యను అభ్యసించిన కృష్ణంరాజు
- హైదరాబాద్ బద్రుకా కాలేజీ ఆఫ్ కామర్స్ నుండి బీకాం పట్టా
- కాలేజీ రోజుల్లో అక్కినేని అభిమానిగా కృష్ణంరాజు
- సి.హెచ్.వి.పి. మూర్తి రాజు ‘ఆంధ్రరత్న’లో పార్ట్ టైమ్ జర్నలిస్టుగా పనిచేసిన కృష్ణంరాజు
- యుక్తవయసులో హైదరాబాద్ అబిడ్స్ బర్మన్ బిల్డింగ్ లో రాయల్ స్టూడియో ప్రారంభించిన కృష్ణంరాజు
- ‘తేనెమనసులు’ మేకప్ టెస్ట్ లో కృష్ణ సెలెక్టెడ్… కృష్ణంరాజు రిజెక్టెడ్!
- ‘వీరాభిమన్యు’లోనూ ఛాన్స్ మిస్ చేసుకున్న కృష్ణంరాజు… శోభన్ బాబుకు అవకాశం
- 1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కృష్ణంరాజు
- ఆత్మ ఆర్ట్స్ బ్యానర్ లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిలకా గోరింక’
- జూన్ 10, 1966న విడుదలైన ‘చిలకా గోరింక’ చిత్రం