BREAKING : మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటనపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

0
494

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసే రోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. మునుగోడు ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు శక్తికి మించి శ్రమిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్ సమన్వయంతో కాంగ్రెస్‌ను లేకుండా చేయాలనుకుంటున్నారన్నారు. వ్యూహాత్మకంగా రెండు పార్టీలు వివాదం సృష్టిస్తున్నాయని, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారని, కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యం తో దుబ్బాకలో బీజేకి ఓటు వేశారన్నారు. అంతేకాకుండా.. ‘ఇప్పుడు ఆ ఎన్నికల్లో దొరికిన డబ్బులు ఏమయ్యాయో తెలియదు.

 

హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెలకు అన్యాయం జరుగుతుందని సానుభూతి పొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్ సానుభూతిపరులు ఈటెల కు ఓటు వేశారు. ఈటల ఆక్రమించుకున్న భూములు ఏమయ్యాయి? ఆయనపై కేసులు ఏమయ్యాయి? ఆయన్ను జైలుకు పంపిస్తామన్న వారు ఏమయ్యారు? కాంగ్రెస్ ను ఆటలోనుంచి తప్పించే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహారిస్తున్నాయి. ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాలని నేను ముందే శ్రేణులకు పిలుపునిచ్చా. మూడు రోజుల క్రితం ఫామ్ హౌస్ లో నాటకం పరాకాష్టకు చేరింది. మునుగోడు ఉప ఎన్నిక, జోడో యాత్ర దృష్టిని మరల్చేందుకే ఈ నాటకాలు. కేసీఆర్, కేటీఆర్ కు ఫామ్ హౌస్ లు బాగా అచొచ్చాయి. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని చర్చకు తెచ్చారు. ఇప్పటివరకు విడుదలైన ఆడియో రికార్డుల ప్రకారం. పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళను డబ్బులు అడుగుతున్నాడు. ఇతరులను తీసుకొస్తానని బేరం చేస్తున్నాడు. రోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్ట్ ఎలా నిలబడుతుంది.

 

ఈ మాత్రం కూడా స్టీఫెన్ రవీంద్ర గారికి తెలియదా? ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల ఫోన్స్ ఎందుకు సీజ్ చేయలేదు. ఏసీబీ పూర్తిగా కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తోంది. కేసును నిరూపించాలన్నా ఫోన్స్, అక్కడి సీసీ కెమెరాలే కీలకం. పోలీసులే ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు.. వారు ఎక్కడున్నారు? వారిని ఏం చేశారు? ఎమ్మెల్యేల ముఠాకు నాయకుడైన కేసీఆర్ పర్యవేక్షణలొనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
అలా అయితే కేసీఆర్ ను ఏ1గా, కేటీఆర్ ను ఏ2గా చేర్చాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చాలి. వారికి సంబంధం లేకుంటే..ఢీల్లీ పెద్దలు ఎవరో తేల్చి వారిపై కేసులు నమోదు చేయాలి. సంతోష్ జీ పేరు కూడా చర్చకు వస్తోంది. అసలు ఏం జరిగిందనేది చెప్పాల్సిన బాధ్యత విచారణ సంస్థలపై ఉంది. ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన పోలీసుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. ఫోన్స్ సీజ్ చేస్తే ఆ ఆడియో రికార్డులు ఎలా బయటకు వచ్చాయి… అదంతా ఎడిటెడ్ వెర్షన్.. అసలు ఆడియోలను విచారణ సంస్థలు బయటపెట్టాలి. భారత్ జోడో యాత్ర దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా.. కాంగ్రెస్ చర్చలోకి రాకుండా చేయాలనే ఈ డ్రామాలు బాధ్యత గల సీఎం, మంత్రుల, అధికారులు ఈ అంశాలపై స్పందించాలి. విచారణ సంస్థలపై మాకు నమ్మకం లేదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ చేయించాలి. 2014 నుంచి ఇప్పటి వరకు 32 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం జరిగిందో వివరించాలి. బండి సంజయ్ వి జోకర్ వేషాలు ఆయన నీళ్లు కాదు యాసిడ్ పోసుకుని ప్రమాణం చేసినా ఎవరూ నమ్మరు. బండి సంజయ్ గుండుతో గుట్ట ఎక్కిన ప్రజలు నమ్మరు. అంత బుద్ది మంతుడైతే స్రవంతి సవాల్ ను స్వీకరించలేదు. ఇప్పటికైనా యాదగిరిగుట్ట నర్సింహ స్వామి మీద ఒట్టేస్తారా. నేను వస్తా..బండి సంజయ్, కేటీఆర్ వచ్చి ఒట్టేస్తారా. లేదా అభ్యర్థులు వెళ్లి ప్రమాణం చేసిన సరే..’ అని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here