బీజేపీ.. టీఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణ వాస్తవం కాదు : రేవంత్‌ రెడ్డి

0
635

సోనియాగాంధీ జన్మదినం తెలంగాణకు పర్వదినమన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. సోనియా గాంధి పుట్టినరోజును పురస్కరించుకొని బోయిన్‌పల్లిలో గల గాంధీఐడియాలజీ సెంటర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల్లో 690 మంది చనిపోయారని, 100 కుటుంబాలకు ఇవాళ రెండు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఢిల్లీ మున్సిపల్, హిమాచల్ ప్రదేశ్.. గుజరాత్‌లో అధికారంలో ఉన్నది బీజేపీనే అని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓడిపోయారు, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోయారని, మోడీ నాయకత్వం నీ తిరస్కరించారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మోడీని ఓడించి… కాంగ్రెస్ కి పట్టం కట్టిందని, బీజేపీ అనుకూల మీడియా మోడీ ఓటమిని చిన్నదిగా చేసి చూపిస్తున్నారన్నారు. గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది.. దాన్ని నిలబెట్టుకున్నారన్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయంకి వెళ్తే.. రెండిట్లో ఓటమి బీజేపీకే అన్నారు. అంతేకాకుండా.. ‘ఉత్తర ప్రదేశ్ అంటే బీజేపీ అని చేర్పుకున్నారు… యూపీ ఉప ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడించారు.

రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2019 లో కూడా గులాబీ కూలి విషయంలో కూడా అవినీతి కి పాల్పడ్డారు అని ఫిర్యాదు చేసిన. చందాలు తీసుకోవాలి అంటే 20 వేల కంటే ఎక్కువ తీసుకోవద్దు. అలా తీసుకున్న ec కి నివేదిక ఇవ్వాలి. కానీ అది కూడా చేయలేదు టీఆర్‌ఎస్‌. ఈ వ్యవహారం పై విచారణ జరిపి trs ని రద్దు చేయాలని కోర్టుకి వెళ్లినా. కేంద్ర ఎన్నికల కమిషన్ కు trs పెరు మార్పు వ్యవహారం పై నేను అభ్యన్తరం వ్యక్తం చేసినా. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసిన..ఈసీ కి నివేదిక ఇవ్వండి అని రాశారు. ఇవేం పట్టించుకోకుండా … టీఆర్‌ఎస్‌ పేరు ఎలా మార్చుతారు. 6న ఢిల్లీ కోర్టు నుండి నోటీసు ఇచ్చింది. సోమవారం చర్చకు వస్తోంది. ఇంతలోనే ఈసీ పేరు మార్పిడిపై నిర్ణయం ఎలా తీసుకుంది. బీజేపీ నిజంగానే కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని అనుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు. పేరు మార్పు ప్రక్రియ పై ఈసీ ఎలా అనుమతి ఇచ్చింది. బీజేపీ.. కేసీఆర్ కి ఎలా సహకరిస్తుందో చూడండి.
ఇంత మంది వ్యాపారుల మీద ఐటీ దాడులు చేస్తోంది. గులాబీ కూలీపై ఎందుకు ఐటీ చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కోసం ఇప్పటికే ఎంఐఎంని మార్చింది బీజేపీ. ఇప్పుడు ఆప్.. వచ్చింది. మూడో వ్యక్తిగా కేసీఆర్‌ని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం బీజేపీ దించబోతుంది. బీజేపీ.. టీఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణ వాస్తవం కాదు. నిజమే అయితే.. ఐదేళ్లుగా ఐటీ.. గులాబీ కూలీ మీద ఎందుకు చర్యలు లేవు. టీఆర్‌ఎస్‌ నుండి బీఆర్‌ఎస్‌గా మార్చే కుట్రలో టీఆర్‌ఎస్‌.. బీజేపీ పాత్రధారులే. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here