రసగుల్లా లా ఉండే పట్టాభి.. నీ ఆరోగ్యం జాగ్రత్త : ఆర్జీవీ

0
609

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇటీవల ఆర్జీవీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఆర్జీవీ ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు ఓ ఆడియోను ఆర్జీవీ విడుదల చేశారు. ఆ ఆడియోలో ‘గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడిముకున్నట్టు బ్యాచ్ అంత ఎందుకు హైరానా పడుటం నాకు అర్ధం కావడం లేదు. ముద్దు గా బొద్దుగా రసగుల్లా లాగా వుంటాడు పటాభి. ఒరేయ్ రసగుల్లా… నేను జగన్ గారిని కలిసానా??..ఎందుకు కలిశాను ఏమి తెలియకుండా ఎలా మాట్లాడతావు. నేను బాడ్ డైరెక్టర్, బాడ్ సినిమా తీస్తాను అని నువ్వు అనుకున్నప్పుడు హ్యాపీ గా వుండాలి కానీ టెన్షన్ ఎందుకు ఫీలవుతావు ఎందుకమ్మా… నువ్వు అంత హైరానా పడితే నికు షుగర్ బీపీ వచ్చి చస్తావ్.. రసగుల్లా. రసగుల్లా లా వుండాలి కానీ మిరపకాయ లాగా వుండకూడదు.

 

నీ మీద కోపం లేదు కానీ జాలి కలుగుతుంది. నేను ఒక మనిషి పేరు కానీ సబ్జెక్ట్ ఎంటి అని కానీ చెప్పనప్పుడు నీకు నువ్వే ఊహించుకొని నువ్వు భయపడి పోయి మీ పార్టీ వాళ్ళను భయ పెడుతున్నావు. నేను మీకు సలహా ఇచ్చే అవసరం లేదు. నాకు స్వీట్స్ అంటే ఇష్టం నువ్వు నాకు నచ్చావు. రసగుల్లా తరువాత నీ అంత ముద్దుగా బొద్దుగా వున్న పదార్థాన్ని నేను చూడలేదు. ఇలా పేలుతా వుంటే బీపీ వచ్చి హార్ట్ ఎటాక్ తో చస్తావు.. నీ అవసరం ఎవరికి లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి వుందని అనుకుంటున్నాను. రసగుల్లా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా’ అని ఉంది. అయితే.. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన ఆర్జీవీ.. రెండు సినిమాలను ప్రకటించారు.

 

వ్యూహం, శపథం పేరుతో ఈ సినిమాలను తెరకెక్కించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఒక ఫ్లాప్ డైరెక్టర్ అని, అలాంటి వ్యక్తినిపక్కన పెట్టుకుని సినిమా తీయించుకుని ఓట్లు సంపాదించుకోవాలనుకునే పరిస్థితికి జగన్ దిగజారరని విమర్శించారు టీడీపీ నేత పట్టాభి. నేడు సినీ ఫీల్డ్‌లో వర్మ వర్మ పరిస్థితి ఏంటో.. రేపు పొలిటికల్ ఫీల్డ్ లో జగన్ పరిస్థితి అదే అన్నారు పట్టాభి. దీంతో పట్టాభి వ్యాఖ్యలపై ఆర్జీవీ పై విధంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here