కోట్లకు కోట్లు కొట్టేశారు.. కానీ, వంద రూపాయలే వారిని పట్టించింది.. ఏకంగా రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు ఎత్తికెళ్లిన ముఠా.. రూ.100 పేటీఎం చేసి దొరికిపోయింది.. ఆ ఒక్కటే.. ఆ ముఠా గుట్టురట్టు చేసింది.. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం ఇద్దరు వ్యక్తలు పహర్‌గంజ్‌లోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వస్తున్నారు.. వీరిలో ఒకరు పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నాడు.. కొద్ది దూరం తర్వాత బ్యాగు పట్టుకుని వస్తున్న ఆ ఇద్దరినీ అడ్డుకున్నారు.. వారితో మరో ఇద్దరు కలిసి.. చేతిలో బ్యాగు ఉన్న వ్యక్తుల కళ్లలో కారం కొట్టి.. ఆ బ్యాగ్‌తో ఉడాయించారు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితుడు సోమ్‌వీర్ చండీగఢ్‌లోని ఓ పార్సిల్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.. బుధవారం ఉదయం 4.15 గంటల సమయంలో మరో ఉద్యోగి జగదీప్ సైనీతో కలిసి పహర్‌గంజ్‌లోని తమ ఆఫీసు నుంచి పార్సిల్ తీసుకుని డీబీజీ రోడ్డు వైపు వెళ్తున్నారు.. అయితే, మిలీనియం హోటల్ వద్దకు వారు చేరుకోగానే.. పోలీసు యూనిఫామ్‌లో ఉన్న ఓ యువకుడితో పాటు మరో వ్యక్తి వారిని ఆపి.. బ్యాగులు చెక్ చేయాలని అన్నాడు. ఇదే సమయంలో మరో ఇద్దరు వచ్చి.. బాధితుల కళ్లలో కారం కొట్టి బ్యాగులుతో పరారయ్యారు.. అయితే, ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులకు సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడ్డాయి..
దాదాపు, వారం రోజుల రోజులకు సంబంధించి ఆ ప్రాంతంలోని 700 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు.. ఇంటెలిజెన్స్ పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించారు.. వారిలో ఒకడు క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగా.. టీ తాగడానికి మరొకడు పేటీఎం నుంచి రూ.100 డ్రైవర్‌కు ట్రాన్సఫర్ చేసి తీసుకున్నట్టు గుర్తించారు.. దీంతో.. ఆ పేటీఎం లావాదేవీలపై దృష్టిపెట్టిన పోలీసులు.. ఆ దొంగలు నజఫ్‌గడ్‌కు చెందినవారిగా గుర్తించారు.. వారంతా రాజస్థాన్‌కు పారిపోయినట్ నిర్ధారణకు వచ్చారు.. ఓ టీమ్‌ను అక్కడికి పంపి.. ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.6 కోట్ల విలువైన 6.3 కిలోల బంగారం, మూడు కిలోల వెండి, 106 ముడి వజ్రాలు, ఇతర వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు.. మొత్తంగా వంద రూపాయలు పేటీఎం చేసి దొరికిపోయారు ఈ బంగారం దోపిడీ దొంగలు.