మీకు ఈ విషయం తెలుసా..? జైలు నుంచి బుల్‭బుల్ పిట్టలపై సావర్కర్‌ భారత్‌కు వచ్చేవారు…!

0
713

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా.. వినాయక్ దామోదర్ సావర్కర్​ పోస్టర్లను ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసిన విషాన్ని మర్చిపోకముందే.. సావర్కర్‌కు సంబంధించిన ఓ పాఠం ఇప్పుడు పెద్ద దూమారమే రేపుతోంది.. కర్ణాటక పాఠ్యపుస్తంలో 8వ తరగతి విద్యార్థుల కోసం ఓ పాఠాన్ని చేర్చారు.. ఆ కన్నడ పాఠ్యపుస్తకం ప్రకారం, సావర్కర్ అండమాన్ జైలులో ఉన్న సమయంలో స్వదేశాన్ని సందర్శించడానికి పక్షి రెక్కలపై కూర్చుని ఎగురుతూ వచ్చేవాడు.. అంతేకాదండోయ్.. సావర్కర్ ఖైదు చేయబడిన సెల్‌కి ఒక కీహోల్ కూడా లేదు… కానీ,. బుల్బుల్ పక్షులు ఆయన గదిలోకి వచ్చేవి.. ఇక, సావర్కర్ వాటి రెక్కలపై కూర్చుని బయటికి వచ్చేవారు..ప్రతీ రోజూ మాతృభూమి (భారత్‌)ని సందర్శించేవారు అని పాఠ్యపుస్తకంలో పేర్కొనడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది..

తాజాగా, ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాన్ని సవరించింది కర్ణాటక ప్రభుత్వం.. హైస్కూల్ పాఠ్యాంశాల్లో వినాయక్ దామోదర్ సావర్కర్‌పై పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ ఒక విభాగాన్ని చేర్చడంతో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం “చరిత్రను తిరగరాస్తుంది” అనే ఆరోపణలపై కర్ణాటకలో ఇప్పుడు వివాదం రేగింది.. ఇది, నెట్టింట్లో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. నమ్మశక్యం కానిది, పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ఉందంటూ నెటిజన్లు కర్ణాటక బీజేపీ సర్కార్‌పై మండిపడుతున్నారు.. బీజేపీ ప్రభుత్వం చరిత్రను తిరగరాస్తోందనే ఆరోపిస్తున్నారు.. సావర్కార్‌ జైలులో ఉన్నాడు సరే.. ఆయన ఉన్న గదికి ఒక చిన్న రంధ్రం కూడా ఉండకపోవడం ఏంటి.. కానీ ఆ గదికి బుల్బుల్ పిట్టలు రావడం ఏంటి.. వాటి రెక్కలపై కూర్చిని ఆయన ప్రతీ రోజూ భారత్‌ను సందర్శించడం ఏంటి..? అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పున:సమీక్షకు కొంతకాలం క్రితం ఆదేశించింది. రోహిత్ చక్రతీర్థ కమిటీ ఈ ఏడాది ఆ బాధ్యతలు చేపట్టింది. ఎనిమిదో తరగతి కన్నడ పాఠ్యపుస్తకంలో గతంలో ఉన్న విజయమాల రాసిన “బ్లడ్ గ్రూప్” అనే పాఠాన్ని తొలగించింది.. దాని స్థానంలో సావర్కర్ జీవితంపై పాఠాన్ని చేర్చారు. అందులో వాస్తవ విరుద్ధమైన ఘటనలు ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here