ఒకప్పుడు బ్యాంకుకు సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి చేసుకునేవారు.. అయితే, సోషల్ మీడియాలో ఎంట్రీతో సీన్ మారిపోయింది.. రియల్ ఏది..? వైరల్ ఏది..? అనేది తెలుసుకోవడమే కష్టంగా మారిపోయింది.. దానికితోడు.. సైబర్ నేరగాళ్లు.. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అన్నట్టుగా.. అన్ని బ్యాంకుల పేర్లతో ఫేక్ మెసేజ్‌లు పంపుతూ.. ఓ లింక్ ఇవ్వడం.. అది క్లిక్ చేస్తూ.. సదరు వినియోగదారుడికి సంబంధించిన సమాచారం మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోవడం జరుగుతూనే ఉన్నాయి.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో కూడా ఇప్పటికే రకరకాల ఫేక్ మెసేజ్‌లు హల్ చల్ చేస్తున్నాయి.. అయితే, ఎస్బీఐ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ బ్యాంక్ ఖాతాదారులను కేంద్రం హెచ్చరించింది.
మీ ఎస్బీఐ బ్యాంక్ ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే.. వెంటనే పాన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సైబర్ మోసగాళ్లు ఫేక్ మెసేజ్ పంపుతారని, వాటికి ప్రతి స్పందించవద్దని స్పష్టం చేసింది కేంద్రం.. పర్సనల్, బ్యాంకింగ్ వివరాలు షేర్ చేసుకోవాలని వచ్చే ఈ-మెయిల్స్‌కు, ఎస్సెమ్మెస్‌లకు స్పందించొద్దని అప్రమత్తం చేసింది.. Report at report.phishing@sbi.co.in నుంచి.. ప్రియమైన వినియోగదారులారా.. ఈ రోజు మీ ఎస్బీఐ యోనో అకౌంట్ మూసివేయబడుతుంది.. అని భయపెట్టే.. అది నిలిచిపోకుండా ఉండాలంటే.. వెంటనే ఈ న్యూ లింక్‌లో మీ పాన్ కార్డు డిటైల్స్ షేర్చేసుకోవాలని ఉంటుందని.. అలాంటి లింక్‌ల దృష్టికి పొరపాటును కూడా వెళ్లొద్దని హెచ్చరించింది కేంద్రం ప్రభుత్వం.. ఇక, ఇలాంటి మెసేజ్‌లపై తన ఖాతాదారులకు ఎస్బీఐ కూడా వార్నింగ్ ఇచ్చింది.. మెసేజ్‌లను జాగ్రత్తగా గమనించాలని.. కార్డు, పిన్, ఓటీపీ, సీవీవీ వివరాలు ఎప్పుడైనా బ్యాంకు అడగదు.. దయచేసి అలాంటి వివరాలు షేర్ చేయొద్దు.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించింది ఎస్బీఐ.