క్రెడిట్‌ కార్డులు ఇలా తెగ వాడేస్తున్నారా..? ఇక మీకు తప్పదు చూసుకోండి..

0
558

క్రెడిట్‌ కార్డు వినియోగదారులారా అలర్ట్‌.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి.. క్రెడిట్‌ కార్డులపై నెల నెలా ఇంటి అద్దె చెల్లించేవారు కొంతమంది అయితే.. ఇంటి అద్దె పేరుతో తమ క్రెడిట్‌ కార్డులోని మొత్తాన్ని మరో ఖాతాకు బదలాయించి వాడుకునేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారట. బయట అప్పులు తీసుకోవడం కంటే.. క్రెడిట్‌ కార్డుపై చెల్లించే వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉండడంతో.. చాలా మంది వివిధ యాప్‌ల నుంచి నెలా నెలా.. కార్డుపై లిమిట్‌ ఉన్నకాడికి లాగేస్తున్నారట.. అయితే, ఇప్పుడు వారికి జేబుకు చిల్లు తప్పని పరిస్థితి.. ఎందుకంటే.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. కీలక నిర్ణయం తీసుకుంది.. క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాకిచ్చింది.. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజుపై అదనంగా రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.. అంతేకాదు.. కొత్తగా రెంట్‌పేమెంట్స్‌ ఛార్జీలు కూడా వసూలు చేయనున్నట్టు పేర్కొంది.. ఈ కొత్త ఛార్జీల మోత.. రేపటి నుంచి.. అంటే నవంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి..

ఎస్బీఐ దీనిపై తమ కస్టమర్లకు మెసేజ్‌లు పంపింది.. ఆ మెసేజ్‌ ప్రకారం.. క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తే.. ఆ రెంటుపై రూ.99+ జీఎస్టీ 18శాతం వసూలు చేయబోతోంది.. ఈ కొత్త ఛార్జీలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.. అంటే.. ఉదాహరణకు.. ఓ వ్యక్తి ఇంటి అద్దె రూ.12 వేలు ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై చెల్లించారే అనుకొండి.. ఇప్పటి వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు.. కానీ, ఎస్బీఐ కొత్త రూల్స్‌ ప్రకారం.. రూ.12వేల ఇంటి అద్దెతో పాటు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.99+జీఎస్టీ 17.82 శాతం చెల్లించాల్సి ఉంటుంది.. మరోవైపు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ప్రాసెసింగ్ ఫీజును కూడా పెంచేశారు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే .. ఆ వస్తువు ధర ప్రాసెసింగ్ ఫీజు, 18 శాతం జీఎస్టీ బాధనున్నారు.. అయితే, ఇప్పటి వరకు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.99గా ఉండగా.. ఇప్పుడు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.199+ 18శాతం జీఎస్టీని వసూలు చేస్తారన్నమాట..

మరోవైపు, ఇంటి అద్దె ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది గనుక కొన్ని యాప్‌లు వినియోగదారులకు వెసులుబాటు కల్పించాయి.. కార్డుపై అద్దె చెల్లిస్తే 0.4 శాతం నుంచి 2 శాతం వరకు సేవా రుసుముగా వసూలు చేస్తున్నాయి. కొన్ని పేమెంట్స్‌ యాప్‌లు దీనినే తమ బిజినెస్‌గా మార్చుకున్నాయి.. రూ.15వేల అద్దె ఉన్నప్పుడు 2 శాతం రుసుము అంటే.. దాదాపు రూ.300 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనంగా పడుతుంది.. అంటే సుమారు రూ.354 అవుతుంది. ఇక, ఈ చెల్లింపుపై రివార్డు పాయింట్లు కూడా వస్తున్నాయి.. కొన్నిసార్లు ఫీజులకు కూడా మినహాయింపులు ఉంటాయి.. దీంతో, చాలా మంది వాటివైపు మొగ్గు చూపుతున్నారు.. కొందరు ఇంటి అద్దె చెల్లిస్తే.. చాలా మంది ఇంటి అద్దె పేరుతో ఇతరులకు నగదు బదిలీ చేయడం.. ఆ మొత్తాన్ని వాడేసుకుంటున్నారు.. ఈ లావాదేవీలకు చెక్‌ పెట్టేందుకు కొన్ని సంస్థలు సిద్ధం అయ్యాయని తెలుస్తుంది.. కానీ, ఎస్బీఐ మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసే రేపటి నుంచే వసూలు చేయబోతోంది.. అంటే ఇప్పటి వరకు సంబంధిత యాప్‌ చార్జీలు మాత్రమే ఉండగా.. ఇకపై బ్యాంకు కూడా చార్జీలు వసూలు చేస్తుందన్నమాట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here