హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. పలు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

0
965

దక్షిణ మధ్య రైల్వే (SCR) జనవరి 11,12 తేదీలలో కార్యాచరణ కారణాల వల్ల ప్యాసింజర్ మరియు పలు MMTS రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. రద్దు చేయబడిన ప్యాసింజర్ రైళ్లలో.. రైలు నం. 07979 విజయవాడ – భద్రాచలం రోడ్, రైలు నం 07278 భద్రాచలం రోడ్ – విజయవాడ, రైలు నం. 07462 సికింద్రాబాద్-వరంగల్, మరియు రైలు నెం. 07463 వరంగల్ – హైదరాబాద్ ఉన్నాయి. అలాగే.. రద్దు చేయబడిన MMTS రైళ్లలో రైలు నం. 47135 మరియు 47137 (2- సర్వీసులు): లింగంపల్లి – హైదరాబాద్ మధ్య, రైలు నం. 47110/47111/47119 (3 ​​సర్వీసులు): హైదరాబాద్ – లింగంపల్లి మధ్య, రైలు నం. 47160/47156/47158/47214/47216 (5 సేవలు): ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య, రైలు నం. 47181/47186/47212/47183/47185/47217 (6 – సేవలు): లింగంపల్లి – ఫలక్‌నుమా మధ్య, రైలు నం. 47177 (1-సేవ): రామచంద్రపురం – ఫలక్‌నుమా మధ్య, రైలు నెం.47218 (1 సర్వీస్): ఫలక్‌నుమా – రామచంద్రపురం మధ్య, రైలు నం. 47201 (1 సర్వీస్): ఫలక్‌నుమా – హైదరాబాద్ మధ్య ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ పేర్కొంది. అయితే.. తెలుగువారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకొనే సంక్రాంతి పండుగకు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here