ఎక్కడ చూసినా బంగారమే.. కేటుగాళ్ళ నయా ఐడియా

0
668

ఎక్కడ బడితే అక్కడ బంగారం బయటపడుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం వివిధ రూపాల్లో తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో బంగారం సీజ్ చేయబడుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి మరీ బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దొరికితే దొంగ… దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది వీరి వ్యవహారం.

తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 89.11 లక్షల విలువ చేసే 2 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టు గా మార్చి పొట్టలో, లోదుస్తుల్లో దాచి తరలించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో అక్రమ‌ బంగారం గుట్టురట్టయింది. దీంతో బంగారం సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు‌ కస్టమ్స్ అధికారులు.

సరిగ్గా రెండురోజుల క్రితమే భారీగా బంగారం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా బంగారాన్ని తరలించేందుకు ఏమాత్రం భయపడడంలేదు. అరెస్ట్‌ చేస్తారనే భయం కూడా లేకుండా వారిపని వారు చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇండోనేషియా ప్రయాణీకుల వద్ద 76.5 లక్షల విలువ చేసే 1700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని గాజులుగా మార్చి కార్బన్ పేపర్ లో చుట్టి లగేజ్ బ్యాగ్ లో దాచారు. వారి గుట్టు రట్టయింది. దీంతో ప్రయాణీకులను అరెస్ట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here