ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంది.. మరోవైపు.. జనసేనతో పాటు బీజేపీతోనూ పొత్తుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కొన్నిసార్లు నేతల కామెంట్లు చూస్తే స్పష్టమవుతూనే ఉంది.. ఇది ఎప్పటికప్పుడు హాట్ టాపికే.. మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.. విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం తెలిసిందే కాగా.. వైజాగ్ నుంచివిజయవాడ చేరుకున్న పవవన్ కల్యాణ్‌ను నోవాటెల్ హోటల్లో కలిసి.. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతోన్న సమయంలో.. పొత్తులపై ఆయనకు ప్రశ్న ఎదురైంది.. దానికి బదులిస్తూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేది ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.
ఉమ్మడిగా మీడియాతో మాట్లాడిన సోమువీర్రాజు, పవన్ కల్యాణ్.. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని అభిప్రాయపడ్డారు. విజయనగరంలో బీజేపీ కార్యకర్తలపై నుంచి వైసీపీ దాడి ప్రారంభమైందన్న పవన్.. ప్రతిపక్ష పార్టీలు నేతలపై దాడులతో భయ పెడుతున్నారు.. జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారు.. నిన్న ఘటన పూర్తిగా ప్రభుత్వం కుట్రగా భావిస్తున్నాం అన్నారు. ఇక, సోము వీర్రాజు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశం అన్నారు. జనసేనాధిపతిగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు చేపట్టారు.. వైసీపీవారు వారికి వారిగా ఒక ఉద్యమం చేస్తున్నారు.. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేనపై కుట్ర చేశారు ఆరోపించారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామన్నారు సోమువీర్రాజు.. వారు కూడా వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని.. రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యలపై పోరు ఉమ్మడిగా సాగిస్తాం అన్నారు.. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాంగా విమర్శించిన సోము వీర్రాజు.. జన స్పందన లేక పోవడంతో కుట్రకు తెర లేపారు.. ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతాం అన్నారు.