ఏపీకి కేంద్రం నిధులు ఆపేస్తాం..! సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు..

0
593

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదన్నారు.. ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రాజకీయాలు తప్పా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు.. రూ.800 కోట్లు ఖర్చు పెడితే సిక్కోలు సస్యశ్యామలం అవుతుందని.. అసలు వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే నేతలకు అభివృద్ధిపై అవగాహన ఉందా?అధికార పార్టీ నేతలకు బుర్ర పనిచేస్తుందా? అంటూ మండిపడ్డారు వీర్రాజు..

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మానకు ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తెచ్చే దమ్ము ఉందా? అంటూ సవాల్‌ విసిరారు సోమువీర్రాజు… అమరావతిలోనే రాజధాని ఉంటుందని జగన్ చెప్పారు.. ఇప్పుడు అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు వికేంద్రీకరణ గురుంచి ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీసిన ఆయన.. అమరావతి రైతుల పాదయాత్రపై దాడి చేయడం, అడ్డుకోవడం ఊక దంపుడు చర్యగా ఫైర్‌ అయ్యారు.. అసలు, అమరావతి రైతులు సిక్కోలు వరకు ఎందుకు రాకూడదో చెప్పాలి..? అని నిలదీశారు.. ఇక, వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగే పనులు తప్పా ఒక్క పనైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజధాని పేరుతో విబేధాలు సృష్టించటం మానుకోవాలని హితవుపలికారు.. మూడు రాజధానులు పేరుతో డ్రామాలు వద్దు అంటున్నాం.. అమరావతి రైతులపై అక్కసుతోనే వికేంద్రీకరణ అంటున్నారు.. కానీ, వికేంద్రీకరణ ద్వారా ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పే దమ్ము లేదు అంటూ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here