మద్యం మత్తులో దారుణం.. తండ్రిపై కొడుకు దాడి

0
700
attack

మద్యం ప్రభావం కుటుంబ సంబంధాలపై బాగా పడుతోంది. మద్యం మత్తులో ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం మండలం చుక్కలూరులో మద్యం మత్తులో తండ్రి మస్తాన్ పై కుమారుడు బాబా ఫక్రుద్దీన్ దాడి చేయగా కుమారుడు దాడిని తండ్రి తప్పించుకొని కర్రతో కొడుకును కొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు బాబా ఫక్రుద్దీన్. తాడిపత్రి మండలం చుక్కులూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న మస్తాన్ కుమారుడు బాబా ఫక్రుద్దీన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మద్యానికి పూర్తిగా బానిస అయ్యాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని తండ్రితో తరచూ గొడవపడేవాడు. సోమవారం రాత్రి మద్యం తాగడానికి తండ్రి మస్తాన్ డబ్బులు ఇవ్వకపోవడంతో బండరాయి తీసుకుని తండ్రి పై దాడి చేయడానికి కుమారుడు బాబా ఫక్రుద్దీన్ ప్రయత్నించారు. కుమారుడు దాడిని తప్పించుకొని తండ్రి మస్తాన్ కర్రతో కుమారుడు తలపై కొట్టడంతో తీవ్రంగా బాబా ఫక్రుద్దీన్ గాయపడ్డాడు. గాయపడిన బాబా ఫక్రుద్దీన్ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

రౌడీ షీటర్ దారుణ హత్య
నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గేట్ ప్రాంతంలో ఉన్న ఏపీ టూరిజం హోటల్ వద్ద గిరీష్ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి సమయంలో గిరీష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి గొంతును కోశారు. దీంతో గిరీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఫతే ఖాన్ పేటకు చెందిన గిరీష్ కు స్థానికులతో తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో గిరీష్ పై పలు కేసుల నమోదు అయ్యాయి. ప్రత్యర్థులే గిరీష్ ను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు .ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here