స్కూల్‌లోనే విద్యార్థుల పూనకాలు.. హడలిపోయిన టీచర్లు..

0
1044

స్కూల్‌లో విద్యార్థులు పూనకంతో ఊగిపోయారు.. వింతగా ప్రవర్తించారు.. పూనకం వచ్చినవారిలా కొందరు ఊగిపోతే.. మరికొందరు అరుపులు, కేకలతో హల్‌చల్‌ చేశారు.. దీంతో హడలిపోయిన టీచర్లు.. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.. అంతటితో ఆగలేదు.. దుష్ట శక్తులు ఆవహించాయంటూ.. కొందరు పెద్దలతో దిష్టి తీయించారు.. మొత్తంగా స్కూల్‌లో విద్యార్థుల వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారం.. స్కూల్, విద్యాశాఖలో కలకలం సృష్టించింది.. ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భగేశ్వర్‌లోని మారుమూల రైఖులీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు. మంగళవారం రోజు కొంతమంది బాలికలు, ఓ విద్యార్థి విలక్షణంగా ప్రవర్తించారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జాతీయ ఛానెల్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది..

రైఖులీలో జరిగిన ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్… వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను మాస్‌ హిస్టీరియాగా వైద్యులు చెబుతున్నారు.. ఈ ఘటన విద్యాశాఖను ఉలిక్కిపడేలా చేసింది. సంబంధిత ఘటనపై ప్రధాన ఉపాధ్యాయురాలు విమ్లా దేవి మాట్లాడుతూ.. ఈ మంగళవారం కొంతమంది బాలికలు, ఒక అబ్బాయి వింతగా ప్రవర్తించారు.. స్కూల్‌ ఆవరణలో ఇలా జరగడం ఇదే తొలిసారి అన్నారు.. ఆ సమయంలో వారు ఏడ్చారు, అరిచారు, వణికిపోయారు.. ఎలాంటి కారణం లేకుండా తలలు కొట్టుకున్నారు.. వెంటనే మేం తల్లిదండ్రులను పిలిపించాం.. వారు స్థానిక పూజారిని పిలిపించి దిష్టి తీయించారని.. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు.. గురువారం మరోసారి అదే పునరావృతమైందని చెప్పారు.. అయితే, విద్యాశాఖ అధికారులతో పాటు.. వైద్యులు కూడా ఇక్కడ ఉన్నప్పుడు.. కొంతమంది విద్యార్థులు అదే విధంగా ప్రవర్తించారని తెలిపారు హెచ్ఎం.. పాఠశాల ఆవరణలోనే పూజ చేయాలని తల్లిదండ్రులు పట్టుబట్టారని.. పాఠశాల నాశనమైందని వారు అంటున్నారని తెలిపారు.. మేం వైద్యులను సంప్రదించడం లేదా పూజారులను సంప్రదించిన తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. అయితే, ఇది ‘మాస్ హిస్టీరియా’ కేసుగా భావిస్తున్నామని తెలిపారు వైద్యులు.. మొత్తంగా విద్యార్థులు పూనకంతో ఊగిపోయిన ఘటన.. సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here