హైవే రన్‌వేపై ట్రయల్ రన్ విజయవంతం

0
765

బాపట్ల జిల్లాలో కొరిశపాడు- రేణింగవరం మధ్యఎన్‌హెచ్‌-16 పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో.. ఎన్టీవీ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ వీఎమ్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రయల్ రన్ విజయవంతం అయ్యిందని, మేము అనుకున్నట్లుగానే ట్రయల్ రన్ చేయగలిగామన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావటానికి సహకరించిన ఎన్‌హెచ్ అథారిటీ అధికారులు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. రెండు సుఖోయ్ 35 ఫైటర్ జెట్స్, రెండు తేజస్ ఎల్‌సీఏ ఫైటర్ జెట్స్, ఒక ట్రాన్స్‌పోర్ట్ విమానం ఏఎన్ 32 ట్రయల్ రన్ లో పాల్గొన్నాయని ఆయన వెల్లడించారు. అత్యవసర ల్యాండింగ్ సమయాల్లో సాధారణ ప్రజానీకం రన్ వే పైకి రాకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. అయితే.. దక్షిణ భారతదేశంలో మొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్ వే ఇది. 4.1 కిలో మీటర్ల పరిధిలో రన్ వే ఏర్పాటు చేశారు అధికారులు.

ప్రధానమంత్రి గతిశక్తి మిషన్ కింద ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వేలను నిర్మిస్తోంది కేంద్రం. ఉదయం 11 గంటలకు ల్యాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్స్, కార్గో విమానాలు సేఫ్‌గా ఈ రన్‌వేలపై ల్యాండ్‌ అయ్యాయి. అయితే.. వచ్చే ఏడాది ప్రధాని చేతుల మీదుగా ఈ రన్‌వేను ప్రారంభించే అవకాశం ఉంది. ట్రయల్ రన్ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు హై వే పై ఆంక్షలు విధించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను రేణంగివరం దగ్గర అద్దంకి వైపు మళ్ళించారు. ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలను మేదరమెట్ట దగ్గర అద్దంకి వైపు మళ్ళించారు. సుమారు 200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here