అది విశాఖ రాజధాని కాదు.. విజయసాయి రెడ్డి రాజధాని…!

0
558

విశాఖపట్నం రాజధానిపై హాట్‌ కామెంట్లు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖపట్నం రాజధాని కాదిది, విజయసాయి రెడ్డి రాజధాని… అని సెటైర్లు వేశారు.. విజయసాయిరెడ్డి రాజధానిలో రాజు విజయసాయిరెడ్డి.. ధనార్జన కూడా విజయసాయిరెడ్డిదే… ప్రజలకు కేవలం మసి పూసి మారేడు కాయ చేసి ఉత్తరాంధ్ర అభివృద్ది పేరితో జగన్మోహన్ రెడ్డి టీమ్ చేస్తున్న నాటకం అని ఆరోపించారు.. విశాఖపట్నంలో భూ కబ్జాలకి ఈ విశాఖను రాజధానిగా వాళ్లు చేసుకున్న నిర్ణయం అని.. దానికి ఉదాహరణ పార్లమెంట్ మెంబెర్, కొన్ని కేసుల్లో ఏ2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు చేసిన భూ కబ్జాలే అన్నారు.. విలువైన భూములకు అర కోర రేటు ఇచ్చి భూ కబ్జాలకు పాలపడిన ఘనపాటి విజయసాయిరెడ్డి అని ఫైర్‌ అయిన ఆయన.. ఈ భూ దందాలపై ఆయన చెప్పిన సమాధానం వినడానికి హాస్యాస్పదంగా ఉందన్నారు.

నేను భూ దందాలు చేయడమేంటి.. నాతో పాటు ఎంవీవీ సత్యన్నారాయణ కూడా ఉన్నారంటూ ఆయన చెప్పిన సమాధానం భూ దందాలు వైకాపా నాయకులు చేస్తున్నారనడంలో వాస్తవంగా చూడొచ్చు అన్నారు రామ్మోహన్‌నాయుడు.. ఉత్తరాంద్ర వాసులు దీనిని గమనించాలని సూచించిన ఆయన.. రాజధాని ఎరగా భూ కబ్జాలకు పాల్పడిన వాళ్లలో ఇద్దరు ఎంపీలుగా విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తే.. ఇంకా, విశాఖపట్నం రాజధానిగా మారితే 154 మంది ఎమ్మెల్యే లు, 22 మంది ఎంపీలు వెరసి వైసీపీ నాయకులు ఈ విశాఖపట్నం భూములను కాజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రహించాలన్నారు.. విశాఖ వాసులకు గాని, ఉత్తరాంధ్ర వాసులకు గాని బాగుచేయాలని ఉండుంటే.. ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర కోసం మేం రాజీనామాలు చేయడానికైనా సిద్ధం అంటున్న వైసీపీ నాయకులారా.. వీరోచితంగా రాజీనామాలు చేస్తామంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కటే నేను చెప్తున్నాను… రాజధాని అంశంతో కాదు సిగ్గుతో రాజీనామా చేయండి అని మండిపడ్డారు. అభివృద్ధి కోసం మిమ్మల్ని ప్రజలు ఎన్నికుంటే… ఈ మూడు సంవత్సరాలలో అదనంగా ఒక్క రూపాయి కూడ తేకుండా అభివృద్ధి చేయని స్థితికి మీరు రాజీనామా చేయండి… ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతీ ఎమ్మెల్యే, మంత్రులు రాజీనామా చేయాలంటూ మేము సూటిగా చెప్తున్న మాట… అమరావతి రైతులు వారి ఆత్మఘోష కోసం కదిలితే ఇప్పుడు గుర్తొచ్చిందా ఉత్తరాంద్ర పై ప్రేమ….! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైల్వే జోన్ మూడు సంవత్సరాలు గడుస్తుంది, ఆ నిర్మాణాల దాని పై ఒక్క రూపాయి తేనందుకు ఒక్కరైనా రాజీనామాలు చేసేందుకు ముందుకొచ్చారా..? అని ప్రశ్నించారు రామ్మోహన్‌నాయుడు.. ఉత్తరాంధ్రకు వెలుగులు నింపి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు ఈ ఉత్తరాంధ్రా మంత్రులు ఎందుకు రాజీనామాలు చేయలేదు…? అని నిలదీశారు.. కేంద్రం పై ఒత్తిడి ఏ ఒక్క వైకాపా నాయకుడైన తెచ్చాడా…? ఇలాంటి సమస్యలు ఉంటే కేవలం కప్పిపుచ్చుకునేందుకే రాజధానులు, రాజీనామాలు అంటూ ఇప్పుడు నాటకం ఆడుతున్నారని విమర్శించారు.. అమరావతి నుండి ప్రజలు ఇక్కడ అరసవల్లిలో దేవుడి తమ గోడు చెప్పేందుకు వస్తే మీరు చేసింది ఏంటి…? అంటూ ఫైర్‌ అయ్యారు. పాకిస్తాన్ లో ఉన్న ప్రజల మాదిరి వారిని అవమానిస్తారా…? మన రాష్ట్ర రైతులు కారా వారు..? అప్పటి రాజధాని కోసం రైతులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ధారాదత్తం చేసిన వారు కారా అమరావతి రైతులు..? అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తామంటే అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ఇప్పటి సీఎం జగన్‌ ఒప్పుకోలేదా…? ఎలక్షన్ లో కూడా చంద్రబాబు వల్ల అమరావతి సాధ్యం కాదు నేను వస్తే పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం చేస్తా అని చెప్పినది జగన్ మోహన్ రెడ్డి కాదా…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here