టీచర్ల బదిలీలకి మార్గదర్శకాలు జారీ

0
1688

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలకి మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెల 12 తేదీ నుంచి వచ్చే నెల 12 తేదీ వరకూ నెలరోజుల పాటు బదిలీల ప్రక్రియ ఉంటుందని పేర్కొంది.. జెడ్పీపీ, ఎంపీపీ స్కూళ్లల్లోని గ్రేడ్ 2 హెడ్‌మాస్టర్ల సర్వీసు కనీసం 5 ఏళ్లు ఉండాలని స్పష్టం చేసింది.. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని వెల్లడించింది.. బదిలీల ప్రక్రియను ఆన్ లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.. ఉన్నత, ప్రాథమిక, ఫౌండేషన్ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం బదిలీల ప్రక్రియ చేపట్టింది.. 3 -10 తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా అవసరమని అంచనా వేస్తోంది విద్యా శాఖ.. బదిలీల కారణంగా 2022-23 విద్యా సంవత్సరం ఒడిదుడుకులకు లోను కాకుండా ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది..

అయితే, రాష్ట్రంలోని పాఠశాలలను టీచర్ల కొతర వెంటాడుతోంది.. దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి.. దీంతో, సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టారు విద్యాశాఖ అధికారులు… రాష్ట్ర వ్యాప్తంగా 3-10 తరగతులకు 6,578 మంది, 6-10 తరగతులకు 1,350 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరమని అంచనా వేశారు.. దీని ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోతే అర్హత ఉన్న ఎస్జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా నియమించనున్నారు.. హేతుబద్ధీకరణ కారణంగా మిగులుగా తేలిన ఎస్జీటీలను అవసరమైన చోటుకు పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో పాటు అర్హత కలిగిన ఎస్జీటీలను ఆయా బడులకు పంపించబోతున్నారు.. ఇక, ఉపాధ్యాయుల బదిలీల తరువాత జిల్లా విద్యాధికారులకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్తవారిని నియమించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల్లో డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here