ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,413 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 612 మందికి కరోనా సోకినట్లు తేలింది. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాదులో 268 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, రంగారెడ్డి జిల్లాలో 42, కరీంనగర్ జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. అయితే.. తెలంగాణలో ఇప్పటివరకు 8,27,995 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,19,613 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4,271 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.