అమరావతిలో ఇవాళ ఇవాళ టీడీపీ ప్రాంతీయ సమావేశం జరగనుంది. సమావేశంలో పాల్గొననున్నారు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలోని 5 పార్లమెంట్ స్థానాల నేతలు, శ్రేణులు, క్లస్టర్ ఇన్ఛార్జిలు. హాజరు కానున్న విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలోని శ్రేణులు.ఎన్నికల సన్నద్ధత పై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.35 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఐదేసి పార్లమెంట్ స్థానాలు ఒక జోన్ గా, రాష్ట్రాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించుకుని పోల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కీలక సమావేశం.
ఈ సమావేశానికి ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, పరిశీలకులు, పాలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జిలు హాజరుకానున్నారు. ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధి పక్రియపై శ్రేణులకు శిక్షణ ఇవ్వనున్నారు. జోనల్, పార్లమెంట్ల వారీగా చంద్రబాబు అధ్యక్షతన సమీక్షలు నిర్వహిస్తారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయంపై కూడా చర్చించనున్నారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.