ఎన్నికల్లో పోటీ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవే నాకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు.. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. ఇదే నాకు చివరి ఎన్నిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. అసెంబ్లీలో నన్ను అవమానించారు.. నా భార్యను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… ఇప్పుడున్నది కౌరవ సభ అని ఆరోపించారు.. ఆ కౌరవ సభను.. నేను గౌరవ సభగా మారుస్తా అన్నారు. పత్తికొండలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. 2003లో నాపై 23 మందు పాతరలు పేలిస్తే వేంకటేశ్వరస్వామి కాపాడారని గుర్తుచేసుకున్నారు.. ఇప్పుడు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.. ఆ ఆరాచక శక్తుల్ని తుదముట్టించాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని.. తప్పులు చేస్తే వైఎస్ జగన్ కాపాడలేరని హెచ్చరించారు చంద్రబాబు.
తాను కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ప్రకటించారు చంద్రబాబు.. మూడు రాజధానులు ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్న ఆయన.. రోడ్లు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా..? అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు భూమి ఇచ్చారని ఇళ్లన్నీ కూల్చేశారని మండిపడ్డారు.. ఆంబోతుల మెడలు వంచి కంట్రోల్ చేస్తా అన్నారు.. విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినపుడు చంద్రబాబు పెట్టిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శం అని వాళ్ల పార్టీ వాళ్ళతో చెప్పారన్నారు చంద్రబాబు.. నవ్య ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో నిలపాలనకున్నా.. కానీ, వైఎస్ జగన్ ఒక్క ఛాన్న్ అన్న మాటకు ప్రజలు మోసపోయారు.. ఇప్పుడు జగన్ ఇచ్చేది గోరంత.. దోచేది మాత్రం కొండంత అని ఆరోపించారు. జగన్ ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. జగన్ వచ్చాక ఒక్క పరిశ్రమ రాలేదని విమర్శించారు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికే వచ్చేదన్నారు చంద్రబాబు.. నేను ఇవాళ వచ్చా.. వైఎస్ జగన్‌ను రమ్మనండి అని సవాల్ విసిరారు.. పత్తికొండ ఎమ్మెల్యే పేటీఎమ్ బ్యాచ్‌ను పంపారు… నన్ను అడ్డుకోవడానికి.. కోడిగుడ్లు, రాళ్లు వేస్తే భయపడతానా…? అని కౌంటర్ ఎటాక్‌కు దిగారు చంద్రబాబు.