ఈనెలలో తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం

0
971

శ్రీవారి హుండీ ఆదాయంలో టీటీడీ కొత్త రికార్డు సృష్టించింది. జూలై నెలలో కేవలం 21 రోజుల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. ఈనెల 1 నుంచి 21 వరకు శ్రీవారికి హుండీ ద్వారా రూ. 100 కోట్ల 75 లక్షలు ఆదాయంగా సమకూరింది. జూలై మాసంలో స్వామివారికి ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారి. టీటీడీ చరిత్రలోకే అత్యధిక స్థాయి ఆదాయం జూలై మాసంలో లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది మే నెలలో వచ్చిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయం.

కాగా.. ఈ నెల 31వ తేదీ వరకు మరింత ఆదాయం వస్తుంది కాబట్టి.. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా ఒకే మాసంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచిలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి. గతంలో 2018 జూలై 26న భక్తులు రూ.6.28 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించారు. కాగా వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ.100 కోట్లు దాటుతోంది. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here