బిచ్చగాడి కొత్త ట్రెండ్.. అంతా ఫాలో అయిపోతారేమో..?

0
668

కొందరు ట్రెండ్‌ సెట్‌ చేస్తారు.. మరికొందరు అది ఫాలో అయిపోతుంటారు.. ఇక, ఎప్పటికప్పుడు ట్రెండ్‌ మారుతూ ఉంటుంది.. అన్ని రంగాలపై ఆ ట్రెండ్‌ కొన్ని సార్లు ప్రభావం చూపుతుంటుంది.. తాజాగా, ఓ బిచ్చగాడు ఫుల్‌ ట్రెండీగా కనిపించాడు. అయితే, ఇప్పుడు ఎక్కడ చూసినా మినీ మైక్‌లు కనిపిస్తున్నాయి.. వీధిలోకి వచ్చే చెత్త బండీ నుంచి, కూరగాయాలు అమ్మేవారు, వివిధ రకాల రిపేర్లు చేసేవారు, చీరలు అమ్మేవారు, టిఫిన్‌ విక్రయించేవారు.. చివరకు పాత ఇనుప సామాను కొనేవారు.. ఇలా అంతా.. గొంతు ఎత్తి అరవాల్సిన అవసరం లేకుండా.. మైక్‌ వాడేస్తున్నారు. అది కూడా రికార్డు చేసిన వాయిస్‌తో.. ఇప్పుడు మంగళగిరిలో కనిపించిన ట్రెండీ బిచ్చగాడు కూడా అదే ఫాలో అయిపోయాడు.. మోపెడ్‌పై మైక్‌తో యాచిస్తూ ఔరా! అనిపించేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరిలోని అంబేద్కర్‌ బొమ్మ కూడలిలో టీవీఎస్‌ మోపెడ్‌ వాహనంపై మైక్‌ ద్వారా ధర్మం చేయండి అంటూ యాచిస్తున్నాడు గోపిరెడ్డి అనే వృద్ధుడు.. మోపెడ్‌పై.. పెట్టిన మైక్‌లో బాబూ ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అమ్మా ధర్మం చేయండి అంటూ రికార్డు చేసిన వాయిస్‌ వస్తుండగా.. అక్కడ గోపిరెడ్డి కూర్చొని యాచిస్తూ కనిపించారు.. ఈ దృశ్యాలు చూసిన వారు.. రోజులు మారాయి.. ధర్మం చేయమని నోటితో అడిగే స్థితికి కూడా కాలం చెల్లిందనుకుంటున్నారు.. అయితే, తెనాలికి చెందిన గోపిరెడ్డి.. నంద్యాల అడవుల్లో వైద్యానికి సంబంధించిన మూలికల కోసం వెళ్లినప్పుడు కాలిలో ముళ్లు దిగాయట.. ఆదికాస్తా సెప్టిక్‌ కావడంతో కాలు మొత్తం పుండ్లు పడి నడవలేని పరిస్థితికి వెళ్లిపోయాడు.. దీంతో.. విధిలేక ఇలా టెండ్రీ బిచ్చగాడి అవతారం ఎత్తాడు. మొత్తంగా గోపిరెడ్డి.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు… మరి బిచ్చగాళ్లు అంతా ఈ ట్రెండ్‌ ఫాలో అవుతారేమో మరి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here