తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. జనగామలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ వెళ్లిపోయాడు.. సంజయ్ ఓ కొజ్జా.. మూర్ఖుడు.. అసమర్ధుడు.. ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు బండి సంజయ్ లేదన్న ఆయన.. జన సమీకరణ చేయలేకనే చౌరస్తాలో మీటింగ్ పెట్టారు అంటూ.. బండి సంజయ్ సభపై సెటైర్లు వేశారు.. కేంద్ర మంత్రుల బూట్లు నాకే బీజేపీ నాయకులు తెలంగాణను అభివృద్ధి ఏ రకంగా చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు.. సర్దార్ సర్వాయి పాపన్న కోటకు ఎన్ని కోట్ల నిధులు ఇస్తానని హామీ ఇచ్చావు? అని ప్రశ్నించారు. నాలుగు వందల కోట్ల నిధులు కేంద్రం నుంచి తెచ్చి ఖిలాషాపూర్ కోటను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ఫ్లెక్సీల చింపివేత, గోడవలపై స్పందించిన ముత్తిరెడ్డి.. మీకు మీరే ఫ్లెక్సీలు చింపుకొని మాపై అభాండం వేశారు అని మండిపడ్డారు.. మీకు చాతనైతే మునుగోడులో మీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని చూపించు అని సవాల్ చేశారు. తెలంగాణ కోసం చావు నోట్లో కేసీఆర్ తల పెట్టి వచ్చారు… మరి బీజేపీ నాయకులు ఏం దీక్షలు చేశారు, ప్రాణ త్యాగం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.. ఇక, దేశవ్యాప్తంగా వంద మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు.. కానీ, తెలంగాణకు ఎందుకు మొండిచేయి చూపించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.