సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు.. టీటీడీ నిర్ణయం

0
678

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టంబర్ 27వ తేదీన శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. భక్తులు రద్ది తగ్గే వరకు సర్వదర్శన భక్తులుకు ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తాం అన్నారు. సర్వదర్శన భక్తులకు స్లాటడ్ విధానంలో టోకేన్లు కేటాయింపు పై అధ్యయనం కొనసాగుతుందన్నారు సుబ్బారెడ్డి.

దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది పాలకమండలి. ఆగస్ట్ 16 నుంచి 20వ తేది వరకు నెల్లూరులో వైభోత్సవాలు నిర్వహిస్తాం. 7.32 కోట్లతో యస్వీ గోశాలకు పసుగ్రాసం కోనుగోలు చేయాలని, 2.7 కోట్లతో పార్వేటి మంటపం నూతన నిర్ణయం చేస్తామన్నారు. 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేస్తారు. 2.9 కోట్లతో అమరావతిలో ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ది చేయనున్నారు. తిరుమలలోని యస్వీ పాఠశాలలో ఉన్నతప్రమాణాలతో విద్యను విద్యార్దులకు అందించేందుకు సింఘానియా గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది.

18 లక్షలతో బేడి ఆంజనేయస్వామి కి బంగారు కవచం ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నైలో రూ.6 కోట్లు,బెంగళురులో రూ.3.23 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా భక్తులు అందించారు. ఈ ఏడాది 33 లక్షల క్యాలండర్లు భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రిక ముద్రణ చేస్తున్నామన్నారు. యంత్రాల సాయంతో లడ్డు ప్రసాదం బూందీ తయారీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే ఆర్గానిక్‌ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం చేసుకున్నాం. ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆగమపండితులు సలహ మేరకు నెల రోజులు తరువాత పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనుంది. అక్టోపస్ కోసం కేటాయించిన భవన నిర్మాణం కోసం అదనంగా 7 కోట్లు కేటాయించాం అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here