ఓల్డ్‌ సిటీలో దారుణం.. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి గ్యాంగ్‌ రేప్‌.. రెండు రోజులు చిత్ర హింసలు..!

0
730

నిత్యం ఏదో ఒక చోట చిన్నారులు, బాలికలు, వృద్ధులు అనే తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కేసులు పెడుతున్నా.. శిక్షలు అమలు చేస్తున్నా.. అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు.. తాజాగా, హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు కలకలం రేపుతుండగా.. ఇది, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.. డబీర్‌పురా రేప్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. 12వ తేదీన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు రబీష్‌మెహది, అహ్మద్ అనే ఇద్దరు యువకులు… అబిడ్స్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్ లోకి తీసుకెళ్లారు.. 12వ తేదీ రాత్రి 8 గంటలకు బాలికను తీసుకొని వచ్చిన ఇద్దరు జాదూగాళ్లు.. హోటల్లోని రూమ్ నెంబర్ 407లో బాలికను దింపారు.. ఇక, బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి రూమ్‌లోనే పడుకోబెట్టి బయటికి వెళ్లిపోయారు.. ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ పడిపోయింది.. అప్పటికే బాలిక మత్తులో ఉండటంతో డోర్ తీయలేదు.. దీంతో డోర్ ను పగులగొట్టి లోపలికి వెళ్లినట్టు లాడ్జి నిర్వాహకులు చెబుతున్నారు..

బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు యువకులు లాడ్జిలో పెట్టి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు.. మరో యువకుడు కూడా బాలికపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. అనంతరం బాలికను లాడ్జిలోనే వదిలి పరారయ్యారు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.. బాలికను లాడ్జిలకు తిప్పుతూ అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, బాలికను భరోసా కేంద్రాన్ని తరలించిన పోలీసులు.. ఆమె నుంచి స్టేట్‌ మెంట్‌ తీసుకున్నారు..

బాధిత బాలికకు మత్తు మందు ఇవ్వడమే కాకుండా.. ఆ ముగ్గురు యువకులు కూడా గంజాయి తీసుకుని బాలకిపై అత్యాచారం చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.. లాడ్జిలో రెండు రోజుల పాటు బాలికను చిత్రహింసలు గురిచేశారు కామాంధులు.. గంజాయి, మత్తు ఇంజక్షన్ల అమ్మకాల్లో రబీష్‌, నిమాయత్‌ కీలక సూత్రధారులుగా పోలీసులు చెబుతున్నారు.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సంబంధిత లాడ్జి నిర్వాహకలు.. 12వ తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రూమ్ తీసుకున్నారు.. మేజర్ కావడంతో అతనికి రూమ్ ఇచ్చాం.. ముందు అమ్మాయి, అబ్బాయి వచ్చారు.. ఆ తర్వాత ఇంకో అబ్బాయి వస్తే అనుమతిలేదని పంపించామని.. 14వ తేది మధ్యాహ్నం చెక్ఔట్ చేశారని తెలిపారు.. అప్పుడు ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి కనిపించారని తెలిపారు.. ఇంకో అతను ఎప్పుడు లోపలికి వెళ్లాడో తెలియదంటున్నారు.. ఇక, ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిన్న రాత్రి అమ్మాయితో పాటు అబ్బాయిని తీసుకొని సంబంధిత లాడ్జికి వెళ్లారు.. రూమ్‌ను పరిశీలించారు.. లాడ్జి సిబ్బందిని విచారించారు… అయితే, వారు లాడ్జికి వచ్చేటప్పుడే మత్తులో ఉన్నట్టు చెబుతున్నారు లాడ్జి సిబ్బంది.. ఆ అమ్మాయికి ఇంజక్షన్లు ఇచ్చారు వీళ్ళు కూడా ఇంజక్షన్లు తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.. ఐడీ కార్డ్ ఇవ్వాలంటూ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని.. చివరకు మేం గొడవ చేయడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.. మొత్తంగా మైనర్‌ బాలిక కిడ్నాప్‌, మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here