రూ.719 కట్టు.. బ్లూ టిక్‌ను పట్టు..

0
719

టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌.. సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.. ఆ తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ట్విట్టర్‌ వెరిపెయిడ్‌ ఎకౌంట్‌.. ‘బ్లూటిక్‌ మార్క్‌’కు డబ్బులు వసూలు చేయనున్నట్టు ప్రకటించారు.. ఎలాన్ మస్క్ గత రాత్రి ట్వీట్ చేసారు, కంపెనీ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవ అందుబాటులోకి వచ్చేసిందని.. ఇక, బ్లూటిక్‌ మార్క్‌ కోసం యూఎస్‌లో 8 డాలర్లుగా నిర్ణయించారు.. 8 డాలర్లు చెల్లించినవారికి బ్లూటిక్‌ మార్క్‌ ను ఇస్తుంది ట్విట్టర్‌.. భారత్‌లోనూ ట్విట్టర్‌ బ్లూటిక్ పెయిడ్ వెర్షన్‌ అమల్లోకి వచ్చింది.. దీనిపై కొందరు యూజర్లకు మెసేజ్‌లు వస్తున్నాయట.. ఇంతకీ ట్విట్టర్‌ బ్లూటిక్‌కోసం భారతీయులు ఎంత చెల్లించాలంటే.. ఇదిగో రూ.719 అంటూ.. కొందరు నెటిజన్లు స్క్రీన్‌ షాట్స్‌ పెడుతున్నారు. ఇప్పుడు అవి వైరల్‌గా మారిపోయాయి.

అయితే, ప్రస్తుతానికి ఐవోఎస్‌ అంటే ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్టుగా తెలుస్తోంది.. మరికొన్ని రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను వర్తింపజేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.. ఇక, బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌ షాట్లు తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేస్తున్నారు.. అందులో నెలవారీ ఛార్జీ రూ.719గా ఉంది.. బ్లూటిక్ కొనసాగించుకోవాలంటే సదరు ఖాతాదారులు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.. వద్దనుకుంటే ఈ ఫీచర్‌ని రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.. మరోవైపు.. “రాబోయే నెలల్లో ట్విట్టర్ చాలా మూర్ఖపు పనులను చేస్తుందని దయచేసి గమనించండి.. మేం పని చేసే వాటిని ఉంచుతాం మరియు చేయని వాటిని మారుస్తాం.. అంటూ ట్వీట్‌ చేశారు ఎలాన్ మస్క్.. ఏదేమైనా.. ట్విట్టర్‌లో బ్లూటిక్‌ ఉండాలంటే మాత్రం ఇండియన్‌ కరెన్సీలో చెల్లించేవారు నెలకు రూ.719 సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్లూటిక్‌ వరకే చార్జీలు అనుకున్నా.. రానురాను ఖాతా ఉంటే చాలు చార్జీలు వసూలు చేయాలన్న యోచనలో ట్విట్టర్‌ చీఫ్‌ ఉన్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి మాత్రం బ్లూటిక్‌ పట్టాలంటే మాత్రం.. రూ.719 కట్టాలన్నమాట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here