టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు అజ్ఞాత వ్యక్తి ఫోన్‌కాల్‌ వైరల్.. నిన్ను వందకి కూడా కొనరు వంద కోట్లు పెడతారా?

0
949

నలుగురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు నిందితులు ఇప్పుడు అరెస్ట్‌ అయ్యారు.. అయితే, ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది? అని కొందరు.. అసలు పైసకు కూడా అమ్ముడుపోని వారికి వంద కోట్లు ఎవరైనా ఇస్తారా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.. ముఖ్యంగా టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య ఈ వ్యవహారంలో పెద్ద రచ్చే జరుగుతోంది.. విపక్షాలు కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందిస్తున్నాయి.. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన గువ్వల బాల్‌రాజ్‌కి ఇప్పుడు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌కి ఫోన్‌ చేసిన అజ్ఞాత వ్యక్తి.. గువ్వల బాల్‌రాజ్‌ గారేనా? అని అడగడం.. దానికి ఎమ్మెల్యే అవును అని సమాధానం ఇవ్వడంతో.. తాను రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఫోన్‌ చేస్తున్నాను.. మిమ్మల్ని ఎవరోకిడ్నాప్‌ చేసి కొన్నారట నిజమేనా? అంటూ ప్రశ్నించాడు.. దానికి స్పందించిన ఎమ్మెల్యే.. టీవీల్లో చూడడం లేదా? అని సమాధానం ఇవ్వగా.. అసలు వందకి కూడా మిమ్మల్ని కొనరు కదా అలాంటిది వంద కోట్లు ఎలా ఇస్తారు? అంటూ ఎద్దేవా చేశాడు.. దీంతో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. మొత్తంగా ఆ చిన్న ఆడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here