పవన్‌పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. రద్దైన నోట్లతో సమానం అంటూ కౌంటర్

0
608

పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్.. వైసీపీ నేతలపై జనసేనాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ గెలవదు శాసనం అని చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా..? 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చెప్తే ప్రజలు పవన్‌ను గేటు కూడా తాకనివ్వలేదు అని కౌంటర్‌ ఇచ్చారు. ఇక, పవన్‌ కల్యాణ్ వారాలబ్బాయి అంటూ సెటైర్లు వేసిన ఆయన.. వైఎస్‌ జగన్ నిలబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన నువ్వు జగన్‌ను విమర్శించడమా..? నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ రాజకీయాల్లో పవర్ లేని స్టార్.. అంటూ ఎద్దేవా చేశారు. కాల్షీట్ ఉంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు, కాల్షీట్స్ ఖాళీ అయితే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంటూ ఆరోపణలు గుప్పించారు.

ఇక, పవన్‌ కల్యాణ్‌ను కాపులు కూడా నమ్మే స్థితిలో లేరన్నారు వెల్లంపల్లి.. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా పవన్ కల్యాణ్‌కు ఉందా? అని నిలదీసిన ఆయన.. పవన్‌ కల్యాణ్‌ రద్దైన నోట్లతో సమానం అనే సంచనల వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు, సీఎం వైఎస్ జన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీయార్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రతీ సచివాలయానికి ముగ్గురు ఇంచార్జీల నియామకం చేపడతాం.. ప్రభుత్వం చేపట్టే మంచిని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here