ఏపీ రోడ్లపై వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు.. వాటిపై దృష్టి పెట్టాలని సూచన

0
849

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై విపక్షాలకు చెందిన నేతలు పలు సందర్భాలు విమర్శలు గుప్పించారు.. జనసేన పార్టీ మాత్రం ఏకంగా గుడ్‌మార్నింగ్‌ సీఎం అంటూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధ్వాన్నంగా మారిన రోడ్లు ఫొటోలను షేర్‌ చేసేలో సోసల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ కూడా నిర్వహించింది.. తాజాగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలోని రోడ్ల దుస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం సమీపంలోని కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా సొంత జిల్లా నెల్లూరులో కిసాన్ క్రాఫ్ట్ సంస్థను నెలకొల్పడంఎంతో సంతోషంగా ఉందన్నారు.. స్ధానికంగా ఉన్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడం ఎంతో అభినందనీయం అన్నారు.. నెల్లూరు జిల్లా నుండి విదేశాలకు వ్యవసాయ పనిముట్లను ఎగుమతి చేయడం ఎంతో గర్వకారణం అన్న వెంకయ్యనాయుడు.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని రోడ్ల పరిస్ధితిపై స్పందించారు.. రోడ్లు మాత్రం ఎంతో దారుణంగా ఉన్నాయన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై దృష్టి పెట్టాలని సూచించారు.. ఇప్పుడు వెంకయ్య చేసిన వ్యాఖ్యలను విమర్శలు స్వాగతిస్తున్నాయి.. నిజంగా రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here