టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ ఆగస్టు 25న భారీ ఎత్తున విడుదలైంది. అయితే తొలిరోజే డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హిందీలో బ్యాన్ ట్రెండ్ ఈ సినిమాకు నష్టం కలిగించింది. అయితే హిందీలో కంటే తెలుగులోనే ఈ సినిమా ఎక్కువగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ కేవలం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 రోజుల తర్వాతే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. అయితే సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో హాట్‌స్టార్ సంస్థ అనుకున్న దాని కంటే డబ్బులు ఎక్కువగా చెల్లించడంతో నాలుగు వారాలకే స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ మేరకు ఈనెల 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో లైగర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన అనన్యపాండే హీరోయిన్‌గా నటించగా రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు.
Telugu film #Liger is expected to premiere on Disney+ Hotstar on September 22nd. pic.twitter.com/aOUDPULy4s
— Streaming Updates (@OTTSandeep) September 20, 2022