చెన్నైలో నిత్య పెళ్లికూతురు అరెస్ట్.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలుసా?

0
892

ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురిని అప్పటికే పెళ్లి పేరుతో మోసం చేసింది. ఏడో పెళ్లికి సిద్ధమయిన ఆ నిత్యపెళ్లికూతురు ఇప్పుడు జైళ్ళో ఊచలు లెక్కపెడుతోంది. వరుసగా ఆరు పెళ్ళళ్ళు… ఏడు పెళ్ళి చేసుకుంటూ ఉండగా దొరికిందా నిత్య పెళ్ళి కూతురు. తమిళనాడులో జరిగిందీ ఘటన. మనం నిత్యపెళ్ళికొడుకుల్ని చూశాం.. అక్కడక్కడా ఇలాంటి కిలాడీ లేడీలు కూడా వుంటారు. పెళ్ళి చేసుకోవడం …శోభనం తరువాత ఉదయాన్నే మొత్తం దోచుకెళ్ళడం నిత్యపెళ్ళి కూతురు సంధ్యకు తాళిబొట్టుతో పెట్టిన విద్య.

నమక్కల్ జిల్లా పరమతివేలూరు చెందిన సంధ్య ఇప్పటివరకూ ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె పెళ్ళంటే ఒక ఆట.. చెన్నై, నమక్కల్,మధురై లోని ఆరుమందిని పెళ్ళి చేసుకుని శోభనం తరువాత నగలు,నగదుతో జంప్ అవుతోంది. తాజాగా ధనపాల్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది సంధ్య. మధురైకి చెందిన ధనలక్ష్మీ అనే పెళ్ళళ్ళ బ్రోకర్ కు రెండు లక్షలు ఇచ్చి సంధ్య ను చేసుకున్నాడు ధనపాల్. అంతా బాగానే జరిగింది. మూడు ముళ్ళు పడ్డాయి.. శోభనం రాత్రి ఆమె చేసిన పనికి పెళ్లికొడుకు షాకయ్యాడు. శోభనం తరువాత నగలు,నగదు ,ఇంట్లోని సామాన్లతో జంప్ అయిపోయింది సంధ్య…

ఉదయాన్ని సంధ్య, బ్రోకర్ ధనలక్ష్మి కనిపించపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు ధనపాల్. తర్వాత మళ్లీ మరో పెళ్ళికి స్కెచ్చేసింది. ఈసమయంలో సంధ్యను అడ్డంగా పట్టుకున్నారు పోలీసులు. రకరకాల గెటప్ లతో, రకరకాల పేర్లతో వరుసగా ఆరు పెళ్ళళ్ళు చేసుకున్న సంధ్యను చూసి అంతా నోరెళ్లబెట్టారు. నమక్కల్ జిల్లాలోని ప్రతి పెళ్లిళ్ళ బ్రోకర్ల వద్ద సంధ్య ఫోటోలు వున్నాయంటే ఆమె ఎంత మోసగత్తో అర్థం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here