ఏదైనా ఆపద వచ్చినప్పుడు పోలీసుల సాయం కోరడం సహజం. కానీ 100 కి ఫోన్ చేసి ఆకతాయిలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి కాల్ ఒకటి పోలీసులకు చెమటలు పట్టించింది. వనస్థలిపురం పోలీస్ లను ఉరుకులు పరుగులు పెట్టించిందో 100 కాల్. తమ ఇంట్లోకి ఒక వ్యక్తి కత్తులతో వచ్చి … బెదిరించి రెండు లక్షలు ఎత్తుకెళ్లారంటూ….డయల్ 100 కు కాల్ చేసింది వనస్థలిపురం నివాసి కొండమ్మ…దీంతో పట్టపగలు దోపిడీ జరిగిందని తెలియటం తో…రంగం లోకి దిగిన సీసీఎస్ , sot, వనస్థలిపురం పోలీసులు.
దోపిడీ దొంగ వచ్చిన ఆనవాళ్లు లేకపోవడం తో… కొండమ్మ ను విచారించిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. భర్త దగ్గర వున్న డబ్బుల కోసం కొండమ్మ నే ..దోపిడీ నాటకం ఆడినట్టు తేల్చిన పోలీస్ లు ఆమెని మందలించారు. ఇంట్లోని పరుపు, మనిప్లాంట్ చెట్టు కింద దాచి పెట్టిన డబ్బులను గుర్తించారు పోలీస్ లు. డయల్ 100 కు తప్పుడు సమాచారం ఇచ్చి…పోలీస్ లను తప్పుదారి పట్టించిన కొండమ్మ ను అదుపులోకి తీసుకున్న పోలీస్ లు ఆమెని విచారిస్తున్నారు. ఎంతో బిజీగా వుండే పోలీసులను ఇలా తప్పుడు కాల్స్ చేసి విసిగించడం ఈమధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. మొన్నామధ్య రైల్వే స్టేషన్ కి కూడా బాంబు వుందని కంప్లైంట్ చేశాడో ఆకతాయి. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి.. అదంతా ఫేక్ కాల్ అని తేల్చిపారేశారు.