కండలు పెంచడానికి వెళ్లారు.. జిమ్‌లో జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు..

0
635

జిమ్‌ అనగానే కండలే గుర్తుకు వస్తాయి.. అయితే, కొంతమంది ఫిట్‌గా ఉండడానికి చిన్న చిన్న వర్కౌట్స్‌ చేయడానికి కూడా జిమ్‌కు వెళ్తారు.. అక్కడైతే ట్రైనర్‌ అందుబాటులో ఉంటారు కాబట్టి.. పని ఈజీగా అవుతుందని భావిస్తారు.. ఇక, ఓపిక అంటే మహిళలే… భూదేవికి ఉన్నంత ఓపిక ఆడవాళ్లకు ఉంటుంది అని చెబుతుంటారు.. అయితే, అన్నిసార్లు ఓపికగా ఉండాలన్న రూలేమీ లేదుగా.. వాళ్లకు గాని తిక్కరేగిందంటే.. ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సార్లు చూశాం.. చిన్న చిన్న విషయాలకే మాటామాట పెరిగి సిగపట్లు పట్టుకున్న సందర్భాలు చాలానే చూస్తుంటాం.. ఈ మధ్యే ముంబైలో లోకల్‌ ట్రైన్‌లో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు.. జిమ్‌లో ఒక పరికరం కోసం ఇద్దరు మహిళ మధ్య జరిగిన ఘర్షణ నెట్టింట రచ్చ మొదలుపెట్టింది..

ఇక, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. ఒక జిమ్‌లో కొందరు మహిళలు ఎక్స్‌సైజులు చేస్తున్నారు.. వెయిట్‌ లిఫ్టింగ్‌ వద్ద ఒక మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తుండగా.. ఇంతలో మరో మహిళ ఎంట్రీ ఇచ్చి.. వెయిట్‌ లిఫ్టింగ్‌ పరికరం కోసం ఎదురు చూస్తున్న మహిళను పక్కకు తోసేసింది.. దీంతో అప్పటి వరకు ప్రశాతంగా ఎదురుచూస్తున్న ఆమె.. ఒక్కసారిగా తిరగబడింది. ఇంకేముందు.. వారిద్దరూ ఒకరి జుట్టును మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. అక్కడున్న మిగతా మహిళలు వారిద్దరినీ అతికష్టం మీద విడిపించారు.. ఈ ఘటన మొత్తం ఆ జిమ్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది.. అయితే, ఒక యూజర్‌ ట్విట్టర్‌లో అది షేర్‌ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.. ఇక, దీనిపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘హే నాకు ఆడవాళ్ల పోరాటాలు అంటే చాలా ఇష్టం.. కానీ జుట్టు లాగడం తప్ప వారికి వేరే ఎందుకు లేదు? అంటూ కామెంట్‌ పెట్టాడు ఓ నెటిజన్.. మరొకరు “అందుకే నేను జిమ్‌కి వెళ్లను, హోమ్ వర్కౌట్స్ మరియు మార్నింగ్ వాక్ చేస్తాను”.. అంటూ మరో వ్యక్తి కామెంట్ రాసుకొచ్చాడు.. మొత్తంగా వినోదభరితమైన, ఫన్నీ వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్ చేసే వాళ్లు మాత్రం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here