బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించిన యువకుడు

0
613

నిరుపయోగంగా వున్న బోరుబావులకు అభం శుభం తెలియనివారు బలవుతున్నారు. కొంతమంది పిల్లల్ని రక్షించే ప్రయత్నం చేసినా.,. అది నిష్ప్రయోజనం అవుతోంది. ద్వారకా తిరుమల మండలం గుండుగొలనుకుంటలో జరిగిన ఘటన ఇది. 30 అడుగుల బావిలో పడిపోయాడు జస్వంత్ అనే బాలుడు. అతడిని బయటకు తీయడానికి అంతా ప్రయత్నించారు. సురేష్ అనే యువకుడి సాహసంతో ఆ బాలుడు సురక్షితంగా బయటకు వచ్చాడు.

30అడుగుల బోరు బావిలో పడిన బాలుడు జస్వంత్ ను బయటికి తీశాడు సురేష్. నడుముకి తాడు కట్టుకుని బోరు బావిలోకి దిగిన యువకుడు సురేష్ బాలుడిని సురక్షితంగా బయటికి తీశాడు. బోరుబావిలో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా వుంటుంది. అదేం పట్టించుకోకుండా.. బాలుడిని కాపాడాలనే సంక్పలంతో సురేష్ తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. గతంలో దేశవ్యాప్తంగా అనేకమంది పిల్లలు ప్రమాదశాత్తూ బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ బోరుబావి కొంచెం పెద్దదిగా వుండడంతో బాలుడిని రక్షించగలిగారు.

నిన్న సాయంత్రం ఆడుకుంటూ పిల్లాడు జస్వంత్ సరిగా రక్షణ లేని బోరుబావి వద్దకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. చాలాకాలం క్రితం 400 అడుగుల లోతు తవ్విన బోరుని అలాగే వదిలేశారు. ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన బాలుడు ఒక రాయి దగ్గర ఇరుక్కుపోయాడు. బాలుడి కోసం వెతికిన తల్లిదండ్రులకు బోరు బావి నుంచి బాలుడి అరుపులు వినిపించాయి.వెంటనే బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న సురేష్ బాలుడిని రక్షిస్తానని చెప్పి.. తాడు సాయంతో బోరుబావిలోకి దిగాడు. బాలుడిని రక్షించిన సురేష్ సాహసాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. జస్వంత్ తల్లిదండ్రులు సురేష్ కి ధన్యవాదాలు తెలిపారు. బోరుబావులు తవ్వేవారు నీరు పడకుంటే దానిని పూడ్చివేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here