ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఈనెల 22న అకౌంట్లోకి డబ్బులు

0
709

ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూతను ఈ నెల 22న అమలు చేయనున్నట్లు కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ వెల్లడించారు. వైఎస్సార్ చేయూతను పండుగ తరహాలో వారం రోజులపాటు మండల స్థాయిలో జరపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కోసం రూ. 4020 కోట్లకు గానూ.. రెండు వేల కోట్లకు పైగా రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం పలికిందన్నారు. విశాఖలో పీఎంఏవై-వైఎస్సార్ స్కీమ్ కింద లక్ష ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు.

అటు ఏపీలో మున్సిపల్ స్కూళ్ల పర్యవేక్షణను విద్యా శాఖకు బదలాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. సీఆర్డీఏ పరిధిలో మౌళిక సదుపాయాల కల్పన నిమిత్తం రూ.1600 కోట్లకు గ్యారెంటీ అందించేందుకు కేబినెట్ ఆమోదించిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. భావనపాడు పోర్టు పరిధిలో మార్పులు చేర్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. ప్రకాశం జిల్లా రుద్ర సముద్రంలో సోలార్ పార్క్ నిమిత్తం 1454 ఎకరాల కేటాయింపు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. 50 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబులు అందచేయడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. 11.43 శాతంతో అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంగా ఘనత దక్కించుకున్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ విషయంలో వ్యక్తిత్వ హననం చేయడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. లిక్కర్ లైసెన్సులు ఎవరి కాలంలో వచ్చాయో చెప్పాలన్నారు. ఆపద్ధర్మ సీఎంగా ఉండి కూడా లిక్కర్ లైసెన్సులిచ్చిన నీచ చరిత్ర చంద్రబాబుది అన్నారు. అసెంబ్లీలో తన భార్యను ఏదో అనేశారని చంద్రబాబు భోరున ఏడ్చారని.. భారతమ్మ లిక్కర్ స్కాములో ఉన్నారంటూ ఇష్టానుసారంగా మాట్లాడతారా అని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here